నేటి నుండి అమెజాన్ లో ‘నారప్ప’

ఈ నెల 20న అమెజాన్ లో నారప్ప విడుదల

విక్టరీ వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నారప్ప. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రిలీజైన నారప్ప టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది.

అమెజాన్ ప్రైమ్ లో ‘నారప్ప’ విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా.. ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు రూపొందించే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర విడుదల విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆలోచిస్తున్నామని ప్రకటించిన నిర్మాత సురేష్ బాబు.. తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జూలై 20వ తేదీన స్క్రీనింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. విక్టరీ వెంకటేష్ కూడా తన ట్విట్టర్ వేదికగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. చివరి వరకూ థియేటర్లలో విడుదల చేయాలని అనుకొని, తప్పని సరి పరిస్థితిలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేశారు.

1 thought on “నేటి నుండి అమెజాన్ లో ‘నారప్ప’

  1. గొప్ప సినిమా. అద్భుతమైన దర్శకత్వం. Nateenatulu బాగా నటించారు. స్టేజిలో మాతోటి నటుడు కార్తీక్ రత్నం కు లైఫ్ ఇచ్చింది ఈ చిత్రం అభినందనలు శుభాకాంక్షలు to cast&cru

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap