కరోనా నుండి ఇప్పుడిప్పుదే కోలుకుంటున్న మన రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొలి సారిగా తెనాలి పట్టణంలోనే నాటక ప్రదర్షన ప్రారంబమయ్యాయి.
తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో 20-12-2020 ఆదివారం మధ్యాహ్నం 3.00 నుండి రాత్రి 8.00 వరకు ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ మరియు కళల కాణాచి సంయుక్త నిర్వహణలో “మహాత్మా” బాలల నాటిక “ఎవరు” పెద్దల సాంఘిక నాటిక మరియు “పంచాగ్నులు” కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనలు కలవు, మధ్యలో 5 గంటలకు సభాకార్యక్రమం కలదు…ఆ సభలో ముఖ్య అతిథిగా తెనాలి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా పట్టణానికి చెందిన ప్రముఖులు శ్రీమతి ఉయ్యూరు హైమావతి, శ్రీ దీపాల సుబ్రహ్మణ్యం,శ్రీ మహమ్మద్ సామ్రాట్ గార్లకు సూపర్ స్టార్ కృష్ణ”విశిష్ఠవ్యక్తి’ పురస్కారాలు అందించబడును, అలాగే “పంచాగ్నులు” సృష్టికర్తలు శ్రీ కుమార సూర్యనారాయణ, శ్రీ గుడిసేవ విష్ణుప్రసాద్, శ్రీ. విజయ్ కుమార్ శ్రీ. సత్యనారాయణ గార్లకు ఆత్మీయ సన్మానం కలదు.