నటరాజ దారుశిల్పం బహూకరణ

భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి సహకారంతో నాట్యాచార్య పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వర్ధంతి సందర్భంగా గ్రంథ రచయిత, దారుశిల్పి బ్రహ్మశ్రీ అమృతలూరి వీరబ్రహ్మేంద్రరావు గారిచే రూపొందించబడిన శ్రీ నటరాజమూర్తి విగ్రహం (నిరాలంబ భంగిమ) దారుశిల్పం కూచిపూడి కళాక్షేత్రమునకు సమర్పించారు.

గుంటూరు, కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో 29 జూలై 2004 సాయంకాలం 6 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం 12వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేశారు.

కూచిపూడి నృత్యాన్ని ప్రపంచం నలదిక్కుల వ్యాపితం చేసిన వారు డాక్టర్ వెంపటి చినసత్యం అని. సృష్టి, స్థితి, లయ కారక అవతారంలో నటరాజమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతిరూపంగా ఉన్నదన్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం కలగలిసిన నటరాజమూర్తి భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనంలో పెనవేసుకుని ఉన్నారని, సాయి మంజీరా కూచిపూడి అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు కొనియాడారు. భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ సహకారంతో నాట్యబ్రహ్మ వెంపటి చినసత్యం ఆరాధనోత్సవం సందర్భంగా దారుశిల్పి అమృతలూరి వీరబ్రహ్మేంద్రరావు బ్రహ్మాజీ రూపొందించిన నటరాజమూర్తి గారు శిల్పాన్ని సోమవారం కూచిపూడి బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి దంపతుల చేతులమీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా దారుశిల్పి వీరబ్రహ్మేంద్రరావును దేవస్థానం పాలకమండలి ఘనంగా సత్కరించారు.

బ్రహ్మాజీ గారి విషయానికి వస్తే చిన్నతనం నుండి చిత్రలేఖనంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితో వివిధ రకాల బొమ్మలు వేస్తూ ఉండేవారు. పురాతన శిల్పాలను చూసి వాటిని గమనించి శిల్పాలను చెక్కటానికి ప్రయత్నించేవారు. ఈ శిల్పాన్ని తయారు చేయటానికి కావలసిన మెలకువలను పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎస్ఎం గణపతి స్టపతి గారితో తరచుగా కలవటం వాటికి తగిన కొలతలు నిష్పత్తులు ఆకారాలకు తగిన అర్థాలను చర్చించుకోవడం మెలకువలను నేర్చుకోవటం తద్వారా అనేక శిల్పాలను చేశారు. ఇలా చెక్కిన దారు శిల్పాలని వేటిని అమ్మ లేదు. చేసినటువంటి దారు శిల్పాలను వివిధ ప్రతిమలను ఒక్కొక్కటిని ఒక్కొక్క దేవాలయాలకు, పీఠాలకు బహుకరించారు. అందులో శ్రీ శృంగేరి శారద పీఠం వారికి వీణాధర దక్షిణామూర్తి ప్రతిమను న్యూ జెర్సీలో ఉన్న శివాలయంలో ధ్యాన నిమగ్నుడైన శివమూర్తిని గుంటూరు లామ్ దగ్గర దేవాలయంలో వీరభద్ర స్వామి ప్రతిమను గుంటూరు బృందావన గార్డెన్స్ లోని యాగశాలకు భిక్షాటన మూర్తి ప్రతిమను, అయోధ్య రామమందిరం కు ‘ఏకం ఏవ అతిథి యం ద్వితీయం బ్రహ్మం’ అనేటువంటి ప్రతిమను బహుకరించారు.

అలాగే కూచిపూడి వారికి నటరాజ శిల్పాన్ని అందజేశారు. వీరు వృత్తిరీత్యా ప్రైవేట్ కంపెనీలలో చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో సొంతంగా వ్యాపారం చేసేవారు. కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఈ దారు శిల్పాలను చేస్తూ రచన వైపు ప్రవేశించారు ఇలా రచించడంతో దాదాపుగా 15, 16 పుస్తకాలను రచించారు. ఇందులో “ది సన్ అనే బుక్” ని ఉస్మానియా యూనివర్సిటీ వారు రిఫరెన్స్ గా తీసుకున్నారు అలాగే “భారతీయ సంస్కృతి దర్శనం” అనే పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు రిఫరెన్స్ గా తీసుకున్నారు. నిరంతరం కృషితో ఒక శిల్పాన్ని చెక్కడంలో వివిధ రకాల భంగిమలతో విశేషఅర్థాలతో తెలియజేసేలాగా శిల్పాలు దర్శనమిస్తాయి. బ్రహ్మాజీగారు మాట్లాడుతూ ఈ దారు శిల్పాలను స్వయంగా తయారు చేసి వాటిని వివిధ దేవాలయాలలో ఇవ్వడం ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. ఈ దారు శిల్పాలను దేవాలయాలకు, పీఠాలకు అందజేయడంతో నా జన్మ ధన్యమైందని అన్నారు. అనంతరం సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్యదర్శి బొర్ర ఉమామహేశ్వరరావు సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు విశ్వసంకీర్తన ఆచార్య తుర్లపాటి శంభాచార్య సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కార్యదర్శి నాట్యాచార్య డాక్టర్ కాజా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మల్లికార్జునాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap