ఒంగోలులో నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సహకారంతో సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న, శనివారం ఒంగోలు అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఒంగోలు మేయర్ జి.సుజాత ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ వర్ధమాన చిత్రకారుల ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సృష్టి ఆర్ట్ అకాడెమి డైరెక్టర్ టి.రవీంద్ర ను అభినందిచారు.

70 మందికి పైగా కళాకారులు, తమ చిత్రాలతో, రికార్డు సృష్టించిన వారితో పాటు విభిన్న ఇతివృత్తాలపై పెయింటింగ్స్‌ను ప్రదర్శించినట్లు అకాడమీ డైరెక్టర్ టి.రవీంద్ర తెలిపారు.

ఈ ప్రదర్శనలో శ్రీమతి చెరువు శ్రీలక్ష్మి 72 సూక్ష్మ చిత్రాల ద్వారా వివరించిన శ్రీకృష్ణుడి జీవితం, అమీర్ జాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల సూక్ష్మ చిత్రాలతో కూడిన శివుని నైరూప్య చిత్రలేఖనం, పేరం రమణ రచించిన అయోధ్య ఆలయం నేపథ్యంలో రాముని పెయింటింగ్ కూడా ఆకర్షించింది, సునీతా రవి రూపొందించిన తంజావూరు శైలి చిత్రం పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారులు వెంపటాపు, రామశాస్త్రి, ఆకొండి అంజి, నరేష్ బొల్లు, ఏ. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

కాగిత కృష్ణ రూపొందించిన నటుడు, రాజకీయవేత్త కృష్ణంరాజుగారి ఫైబర్ విగ్రహం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ. ఈ కార్యక్రమాన్ని అసాంతం ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం గారు నిర్వహించారు.
మూడు రాష్ట్రాల నుండి హాజరయిన చిత్రకారులు వివిధ మీడియంలలో పలు అంశాల పై చిత్రించిన చిత్రాలతో ఎగ్జిబిషన్‌ లో పాల్గొన్నారు.
సాయత్రం జరిగిన ముగింపు సభలో ఎగ్జిబిషన్‌ లో పాల్గొన్న చిత్రకారులందరిని సన్మానించి మెమెంటోలు అందించారు.
కళాసాగర్

Exhibition inauguration
artist Sravani with Sailaja Bharath

Mayor G. Sujatha & Bollu Naresh
Sundar, Ameer, Ravindra, Ramesh and Kalasagar
SA:

View Comments (3)

  • మా కార్యక్రమాన్ని పొందు పరిచి నందుకు కృతజ్ఞతలు కళాసాగర్ గారు

  • మంచి సమాచారం... సర్...
    64 కళలు.కం వారికి ధన్యవాదములు

  • సృష్టి ఆర్ట్ అకాడెమి వారికి అభినందనలు, ధన్య వాదాలు 💐🙏💐 జాతీయ చిత్ర కళా ప్రదర్శన ద్వారా కళాకారుల్లో నూతనోత్సాహాన్ని కలిగించారు 💐
    శుభా కాంక్షలు 🎉🎉-Vempataapu