1980 వ దశకంలో తెలుగునాట ఒక ప్రముఖ వారపత్రిక ప్రచురించే కధలకు ఆ పత్రికా ఎడిటర్ కేవలం నలుపు తెలుపు వర్ణాల్లో ప్రచురించే కథా చిత్రాలు తెలుగు పాటకులను నిజంగా ఉర్రూతలూగించేవి. యండమూరి వీరెంద్రనాద్, కొమ్మనాపల్లి గణపతిరావు, మల్లాది వెంకటకృష్ణ మూర్తి లాంటి పాపులర్ రచయితల యొక్క సీరియల్స్ దానికి ఒక కారణం అయితే. కదానుగునంగా ఆ పత్రికలో ఇరువురు చిత్రకారులు కేవలం బ్లాక్ అండ్ వైట్ లో వేసే చిత్రాలు ఆ పత్రికా పాటకులను ఒకవిధమైన స్వప్నలోకాలకు తీసుకుపోయెలా చేయడమే గాక అటు పాటకులతొ బాటు ఇటు తెలుగునాట చిత్రకారులకు మరియు చిత్రకళాభిలాషులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసేవి. కారణం వీక్షకుడు విస్తుపోయే పోటోగ్రఫీని తలదన్నేలా ఆ seeరియల్స్ కి వాష్ టెక్నిక్ లో వాళ్ళు వేసే బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఉండడమే అందుకు కారణం. ఆ ఇద్దరు చిత్రకారుల్లో ఒకరు ఉత్తరాంధ్రనందలి కాశీ బుగ్గ నుండి వచ్చిన యువ చిత్రకారుడు ఒకరైతే దక్షినాంధ్ర నందలి కారంచేడు నుండి వచ్చిన మరో యువ చిత్రకారుడు ఇంకొకరు. కాలక్రమంలో ఒకరు అమెరికా నందలి ప్రఖ్యాత యూనివర్సల్ స్టుడియోలో సైతం పనిచేసి తర్వాత ‘స్టార్ ఫీచర్ కంపెనీ’ని స్థాపించి, హైదరాబాద్ లో స్థిరపడిపోయిన ఆ ఉత్తరాంద్రకు చెందిన ప్రముఖ చిత్రకారుడు “ఉత్తం” అయుతే రెండో వారు కేవలం ఒక చిత్రకారుడి గానే గాక తన కత్తిలాంటి రేఖా నైపుణ్యంతో దేశం గర్వించే గొప్ప కార్టూనిస్టుగా జాతీయ స్థాయిలో ఒక ఆంగ్ల దినపత్రికలో గత ౩౦ సంవత్సరాలుగా తన కుంచెకు కలానికి కనీసం ఒక్కరోజు కూడా విరామం లేకుండా చురకత్తుల లాంటి తన రేఖానైపున్యంతో పొలిటికల్ సెటైర్లు విసురుతు దేశంలోనే కార్టూన్ ఎడిటర్ అన్న అర్హతను సాదించిన మొట్టమొదటి ఇండియన్ కార్టూనిస్ట్ గా ఖ్యాతి గడించడం, ఆ వ్యక్తి మన తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం. ఆయనే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ కు ఎడిటోరియల్ కార్టూనిస్ట్ గా పనిచేస్తున్న షేక్ సుభాని గారు. ఈ ఆగస్టు 5 ,2 024 న 2023 సంవత్సరానికి గాను ‘జాతీయ ప్రెస్ కౌన్సిల్’ నుండి జర్నలిజంలో ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్షలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్‘ ను సుభాని గారు అందుకున్న సందర్భంగా ఈ వ్యాసం.
సుభాని గారు 1961 ఆగస్టు 11 వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. ఇంటర్ మీడియేట్ చదివే రోజుల్లో వాల్లవూరి నందలి లైబ్రేరీకి రేగ్యులర్ గా వెళ్తూ అక్కడికి వచ్చే దిన, వార మాసపత్రికలను చదువుతున్న సమయంలో అందులో ప్రచురితమయ్యే బాపు, జయదేవ్ బాబు సత్య మూర్తి గార్ల కార్టూన్లు తనను బాగా ఆకర్షించేవి ఆయన చెప్తారు. స్వతహాగా బొమ్మలపై ఆసక్తిగల సుభాని తనకు వచ్చిన ఆలోచనలతో గీసిన బొమ్మలను తన స్కూల్ మరియు కళాశాల నోటీస్ బోర్డ్ పై అంటించే వారు. చక్కగా బొమ్మలు వేస్తుండే సుభాని సైన్స్ విద్యార్ధి కూడా కావడంతో కళాశాల రికార్డ్స్ మరియు సావనీర్లలో కూడా సుభానితొనే ఎక్కువగా బొమ్మలు వేయిస్తు ఉండడంవలన సహజంగానే ఆ కళాశాల విధ్యార్డుల్లోనే గాకా అధ్యాపకులలో కూడా సుభానికి ప్రత్యేక స్థానం ఉంటుండేది. తన క్లాసు టీచర్స్ మరియు స్నేహితుల ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా పంపిన కొన్ని కార్టూన్లు ఆంధ్రభూమి మరియు జ్యోతి పత్రికలలో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమవ్వడమే గాక కాంప్లిమెంటరీ కాపీలతో బాటు పదిహేను రూపాయల పారితోషికం కూడా తొలిసారిగా అందుకోవడం జరిగింది. తన తల్లిదండ్రులు టీచర్స్ మరియు మిత్రుల ప్రోత్సాహంతో ప్రతినెల అన్ని పత్రికలకు కార్టూన్లు వేసి పంపడం వల్ల ఆయా పత్రికల వాళ్ళు పంపించే పారితోషికం తను చదువుకున్న రోజుల్లో పాకెట్ మనీగా ఉపయోగ పడేదని చెబుతారు . గ్రాడ్యుయేషన్ టైంలో కార్టూనిస్ట్ బాచి, కాటూరి తదితర్లతో పరిచయం ఏర్పడింది. 1985 లో జ్యోతి మాసపత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీల్లో ఒక సబ్జెక్టు మీద గీసిన తన కార్టూన్లకు ప్రధమ బహుమతి రావడం ఆ పోటీకి బాపు రమణ గార్లు న్యాయ నిర్ణేతలుగా ఉండడం మరియు శంకు గారు క్రోక్విల్ అకాడమి స్పోర్ట్స్ అధారిటీ నిర్వహించిన కార్టూన్ పోటీల్లోఅన్ని విభాగాలలో బహుమతి సుభాని గారికి రావడం కార్టూనిస్టుగా నిలదొక్కుకోవడానికి దోహదపడిందని ఆయన చెబుతారు. 1985 లో ఆంధ్రభూమి వీక్లీలో ఇలస్త్రేటర్ మరియు కార్టూనిస్టుగా జాయిన్ అయ్యారు. తర్వాత 1988 నుండి 1990 వరకూ ఆంధ్రభూమి దినపత్రికకు పొలిటికల్ కార్తూనిస్ట్ గా పనిచేశారు 1990 నుండి నేటివరకూ డెక్కన్క్రానికల్ గ్రూప్ లో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తూ నేటివరకూ 35000 పై చిలుకు పొలిటికల్ కార్టూన్స్ వేసారు ఇంకా వేస్తున్నారు.
కార్టూనిస్టుగా ఇంతవరకూ జాతీయ, అంతర్జాత్జ్హీయంగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2021లో శేఖర్ మెమోరియల్ అవార్డు, 2018 లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురష్కారాన్ని 2017లో నవ తెలంగాణ బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డుని, 2016 లో కార్టూన్ వాచ్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు 2014 లో వరల్డ్ జర్నలిస్ట్ డే సంధర్భంగా భారత ప్రకాసన్ ట్రస్ట్ నుండి బెస్ట్ కార్తూనిస్ట్ అవార్డ్ 2013 లో మరలా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి నుండి లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు 2010 లో యుద్ వీర అవార్డ్, మరియు దక్షిణ కొరియా సియోల్ నుండి HM Prize, 2005 లో ఇరాన్ కార్టూన్ హౌస్ నుడి ప్రైజ్ ఆఫ్ హానర్, మరియు తబ్రిజ్ ఇంటర్ నేషనల్ కార్టూన్ ఫెస్టివల్ నిర్వహించిన “ప్రివెన్షన్ ఆఫ్ఎడిక్షన్” అనేఅంశం పై నిర్వహించినకార్టూన్ పోటీలలో సెలెక్టెడ్ ప్రైజ్, 2004 లో చైనా కార్టూన్ ఫెస్టివల్ లో అవార్డ్ ఆఫ్ సక్సెస్, ఇరాన్ కార్టూన్ హౌస్ నుండి హానర్ బుల్ మెన్షన్, మరల అదే సంవత్సరం షాంగై చైనా నుండి కూడా హానర్ బుల్ మెన్షన్ అవార్డ్ 2003 లో ఇంటర్నేషనల్ కార్టూన్ ఫెస్టివల్ చైనా నుండి ఎక్షలెన్స్ ప్రైజ్, దేజాన్ ఇంటర్నేషనల్ కార్టూన్ కాంటెస్ట్ కొరియా నుండి ఫిఫ్త్ దేజాన్ అవార్డ్, ఇంకా బెల్జియంలో జరిగిన 42 వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో పబ్లిక్ ప్రైజ్ అవార్డ్ 2002 లో గ్రీస్ మరియు చైనా దేశాల నుండి సెలెక్టెడ్ ప్రైజ్ 2001లో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ వారు నిర్వహించిన నేషనల్ కార్టూన్ పోటీలలో మొదటి బహుమతిని ఇంకా ఎన్నో బహుమతులు సుభాని గారు సొంతం చేసుకున్నారు.
ఇంకా ఆయన తన కార్టూన్లతో THE DRIVE , POINT COUNTER POINT AADAAB HYDERABAD అనే మూడు కార్టూన్ సంకలనాలను వెలువరించారు.
సాధారణంగా ఒక పత్రికలో పని చేస్తున్న కార్టూనిస్ట్ తాను పని చేస్తున్న ఆ పత్రికా కార్యాలంలోనే ఉండి, ఆ పత్రిక సంపాదకుడి మార్గనిర్దేశంలోనే పని చేయవలసి ఉంటుంది. కాని సుభాని అందుకు మినహాయింపు అని చెప్పాలి. కారణం ఆయన పనిచేయడానికి ఏకాంతం అవసరంలేదు ప్రత్యేక ప్రదేశమూ అవసరంలేదు. ఆయన ఎక్కడున్నా ఎలావున్న ఆరోజు వార్తవిశేషంతో ఒకరి సలహా లేకుండానే వారి అంచనాలకు మించినరీతిలో వారికి ఒకటికాదు, రెండు కాదు ఎన్నైనా అందిస్తున్నపుడు ఆయనకు ఒక పరిధిని గీయవలసిన అవసరం ఆ పత్రిక సంపాదకులకు ఏర్పడకపోవడంతో సుభాని గారు మరింత ఉత్సాహంగా అటు దక్కన్ క్రానికల్ తొ బాటు అంతర్జాతీయ దిన పత్రిక ది ఆసియన్ ఏజ్ అనే పత్రికకు కూడా నిరంతరం కార్టూన్లు అందించగలుగుతున్నారు.
చిత్రాలను సృష్టించడానికి గొప్ప గొప్ప రంగులు బ్రష్ లూ ఉండనవసరం లేదు, చేతిలో దన్ను… దానికి తోడు బ్లాక్ జెల్ పెన్ను ఉంటె చాలు అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరింపజేయవచ్చు అని నిరూపించిన గొప్ప చిత్రకారులు సుభానిగారు. ప్రకృతిలోని వివిధ సుందరమైన మరియు చారిత్రక ప్రదేశాలను తన మిత్రులతో కలసి సందర్శించడం ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యాపకం అంతేగాక ఆ సందర్శన సమయంలో అప్పటికప్పుడు తన స్కేచ్ బుక్ లో ఆయా సుందరమైన చారిత్రక కట్టడాలను తన జేబులో గల బ్లాక్ పెన్నుతో తన స్కేచ్ బుక్ లో డ్రా చేసుకోవడం ఆయన హాబీ. ఉత్తర దక్షిణ భారతం నందలి ముఖ్యమైన చారిత్రక కట్టడాలను ఎన్నింటినో సందర్శించి వాటిని అద్భుతమైన రేఖా చిత్రాలుగా ఆయన మలచిన తీరు అద్భుతం అనిపిస్తుంది. 2017 లో బెంగుళూరు నందలి ప్రఖ్యాత IIC GALAREE (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్తూనిస్త్స్) గేలరీ నందు జరిగిన మన తెలుగు కార్టూనిస్టుల ప్రదర్శనకు వెళ్ళిన సందర్భంలో కర్నాటకలో చారిత్రక ప్రదేశాలైన శ్రావణ్ బెల్గోల హోయసాలులు కట్టించిన బేలూరు హలిబీడు దేవాలయాలను సుభాని గారితో కలిసి సందర్శించినపుడు అక్కడ దేవాలయాలను తన స్కెచ్ బుక్ లో ఆయన వేస్తుండగా ప్రత్యక్షంగా చూడడం ఒక మంచి అనుభూతి. ఆయన దేశ వ్యాప్తంగా తిరిగి వేసిన ఆయా చిత్రాలను ‘ది వాల్ ఆఫ్ హెరిటేజ్’ పేరుతో రాష్ట్రంలోని ప్రఖ్యాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నందు ప్రత్యేకంగా అలంకరించడం గొప్ప విశేషం.
జాతీయ అవార్డ్: ఏటేటా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే జాతీయస్థాయి పురస్కారాల్లో భాగంగా 2023కు గాను డెక్కన్ క్రానికల్లో కార్టూనిస్ట్ సుభానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే కార్టూన్లు, క్యారికేచర్ల విభాగంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో సోమవారంనాడు రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజన ప్రకాష్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఫిబ్రవరి 5న డెక్కన్ క్రానికల్లో ప్రచురితమైన కార్టూన్ ద్వారా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రూ.50 వేల నగదు బహుమతి, జ్ఞాపిక, మెమొంటోను సుభానీ స్వీకరించారు.
చివరిగా ఒక కార్టూనిస్టుగా చిత్రకారుడిగా జాతీయ అంతర్జాతీయంగా ఎంత ఎత్తుల్లో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కార్టూన్ రంగంలోకి అడుగిడుతున్న వాళ్ళతో సైతం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి సలహాలు సూచనలు చెప్పే సుభాని గారు నేడు ‘జాతీయ ప్రెస్ కౌన్సిల్’ నుండి జర్నలిజంలో జాతీయ అవార్డ్ అందుకున్న సందర్భంగా వారికి 64కళలు.కాం పత్రిక తరపున హృదయపూర్వక శుభాభినందనలు.
–వెంటపల్లి సత్యనారాయణ
ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ & ఆర్ట్ క్రిటిక్
9491378313
సుభాని గారి గురించి తెలుసుకొనుటకు ఇది సమగ్ర కథనం. వెంటపల్లి సత్యనారాయణ గారు ఎంతో చక్కగా వ్రాశారు.
Thank you so much sir for your valuable comments
Well covered. We are proud of Subhani garu
Lal-Vizag
Thank u sir LAL garu for your comments
తెలుగు వాడిగా పుట్టి దేశీయ, అంతర్జాతీయ కార్టూనిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎంతో ఎత్తుకు ఎదిగినా నిరాడంబరంగా,తోటి కార్టూనిస్టుల పట్ల ఎంతో స్నేహంగా ఉంటూ, కార్టూనిస్టులందరికీ ఒక స్ఫూర్తి వంతం గా నీలిచిన గౌ. శ్రీ సుభానీ గారు మరెన్నో విజయాలు సాధించాలని నా ఆకాంక్ష, అభినందనలు. 💐👌👍🙏Bomman
ధన్యవాదములు బొమ్మన్ సర్. నిజంగా సుభాని గారు అంత ఎత్తుకు ఎదిగినా గర్వం లేకుండా తోటి కార్టూనిస్తుల పట్ల ఎంతో స్నేహపూర్వకముగా వుండే తీరు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ స్పసందనకు ధన్యవాదములు