జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య పోటీ విజేతలు

మానవ జీవితాన్ని అద్దంపట్టేవి మరియు మానవ రుగ్మతలకు దూరం చేసేవే కళలు. అందులో భారతీయ కళలు గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఘనంగా చెప్పుకోవచ్చు. మానవ రుగ్మతలను పోగొట్టడానికి భరతముని చేసిన గొప్ప ప్రయోగమే నాట్యశాస్త్రం. ఇందులో రస సిద్ధాంతం, నాటకం, సంగీతం, నృత్యం వంటి ప్రక్రియలు జోడింపబడ్డాయి. ఈ నాట్యశాస్త్రం ప్రపంచమంతటా గుర్తింపు పొందినది. భరతముని జయంతిని సంస్మరించుకుంటూ సంస్కార భారతి, సుమధుర కళా నికేతన్ సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం విజయవాడ, అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ వేదిక పై జరిగింది. ఫిబ్రవరి 7,8 తేదీల్లో నృత్య పోటీలు జరిగాయి. ఈ పోటీలు ఐదు విభాగాల్లో మూడు కేటగిరీల్లో 650 మంది పాల్గొనగా, విజేతలను ఎంపికచేసి ప్రముఖులతో బహుమతులు అందించారు.

కూచిపూడి నృత్యం సీనియర్స్ లో సాయి వర్షిత వర్మ, భావన, నిఖిత లక్ష్మి, జూనియర్స్ లో జాస్విత, యశ్వర్ధిక్, నిశ్వన, సబ్ జూనియర్స్ లో లోచన శ్రీ వర్షిత, దేవాన్షి, ప్రితిమహల్లిక ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. భరతనాట్యం సీనియర్స్ విభాగంలో మధుర్నిమా, సన్విశ్రీ, నమోనిక, జూనియర్స్ లో మిధున, మనస్విఫణి, సాయి లక్ష్మి, సబ్ జూనియర్స్ లో నాగవర్నిక, ఆరాధ్యశ్రీ, దివ్యాన్ శ్రీసార, ఆంధ్రనాట్యం సీనియర్స్ షేక్ షర్మిళ, దేవార్షిణి, హరిణి, జూనియర్స్ నాగతన్విశ్రీ, లాస్యప్రియ, తేజస్విని సబ్ జూనియర్స్ అక్షర దేశ్ పాండే, మేఘనందన, సహస్ర ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. జానపద బృంద నృత్యం లో మధురిమ గ్రూప్, శ్రీ ఉమామహేశ్వర కళానికేతన్, తలశిల రుహిత గ్రూప్, శాస్త్రీయ బృంద నృత్య పోటీల్లో శ్రీ కనకదుర్గ నాట్య మందిర్, అమృత గ్రూప్, సన్విశ్రీ గ్రూప్ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్వీకరించారు. మరికొన్ని ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. ప్రముఖ నాట్యాచార్యులు హేమంత్ కుమార్, సుధీర్ రావు, సంతోష్, పద్మశ్రీ, అనూరాధ, తులశీకృష్ణ, మంజూష, స్రవంతి, కల్పన నృత్యపోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ కృష్ణ, సుమధుర అధ్యక్షులు సామంతపూడి నరసరాజు, ప్రముఖశిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, పి.వి. భాస్కరశర్మ, పి. సాయి శంకర్, జె. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో విజేతల కేరింతల మద్య బహుమతి ప్రదానం ఘనంగా జరిగింది.

బి. ఆంజనేయ రాజు
కే. వి. శివ కుమార్

Share via
Copy link
Powered by Social Snap