జాతీయ స్ధాయి కథల పోటీకి ఆహ్వానం

“బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌ ” విశాఖ సంస్కృతి మాసపత్రిక మీడియా సౌజన్యంతో నిర్వహిస్తున్న 8వ జాతీయ స్ధాయి కథల పోటీకి ఆహ్వానం.
నియమ నిబంధనలు :
1) కధ నిడివి చేతివ్రాతలో 5 (A4 సైజ్) పేజీలు, డి.టి.పి లో 4 ( A4 సైజ్ ) పేజీలకు మించరాదు.
2) రచనపై రచయిత పేరు, చిరునామా, సెల్ నెంబరు ఉండరాదు. హామీపత్రం లో మాత్రమే వివరాలను తెలియజేయాలి.
3) ఈ కధ ఇప్పటివరకు ఎక్కడా బహుమతి పొందలేదని, మరెక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనలో లేదని హామీపత్రం తప్పనిసరిగా జతచేయాలి.
4) కథల్లో కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలు, సామాజిక అంశాలు ప్రతిబింబించాలి.
5) న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన 6 కథలకు రూ. 2,500/- చొప్పున నగదు బహుమతి ఇవ్వబడుతుంది.
6) బహుమతి పొందిన కథలు విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురింపబడతాయి.
7) తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
8) కథలు చేరవలసిన చివరి తేది : 24-8-2024.

9) కథలు పంపాల్సిన చిరునామా :
బండికల్లు జమదగ్ని,
అధ్యక్షులు, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ ,
ఫ్లాట్ నెంబరు 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట,
గుంటూరు – 522002. లేదా ఈ-మెయిల్ : bjmarkandeyulu@gmail.com
ఆహ్వానించువారు :
బండికల్లు జమదగ్ని, అధ్యక్షులు, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్
సెల్ : 9848264742
శిరేల సన్యాసిరావు, సంపాదకులు, విశాఖ సంస్కృతి మాసపత్రిక
సెల్ : 9603076777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap