జాతీయ పత్రికా దినోత్సవం (16-11-20) పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంఘ నేతలు సోమవారం ప్రెస్ అకాడమీ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయునిగా పాత్రికేయ సంఘం నేతగా విశేష సేవలందించిన ఆయన ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సమర్థనీయ సేవలందిస్తున్నారని “పెన్ ” సంఘం నేతలు కొనియాడారు. ప్రెస్ అకాడమీ చరిత్రలోనే సుపరి పాలన అందిస్తున్న సమర్ధనీయ చైర్మన్ గా పేరుతెచ్చుకున్న దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి యూనియన్లకు అతీతంగా అందరినీ కలుపుకు పోతూ పాత్రికేయుల అభ్యున్నతికి అకుంటిత దీక్షతో కృషి చేస్తున్నారని “పెన్” రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ వారి సేవలను అభినందించారు. చైర్మన్ ను సత్కరించిన వారిలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పెన్ నేతలు జునూతుల శివరామ్, టివి రంగారావు, రేపల్లె యువరాజ్ వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.