సైన్సుతోనే మానవ ప్రగతి

ఆధునిక జీవన విధానం పూర్తిగా సైన్సుతోనే ముడిపడి ఉందని, శాస్త్రీయ విద్య, నేర్పరితనం, నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని గోరా సైన్సు సెంటర్ డైరెక్టర్ జి. నియంత జాతీయ సైన్సు దినోత్సవం(28-02-21) సందర్భంగా విజయవాడ, నాస్తిక కేంద్రంలో జరిగిన సభలో పేర్కొన్నారు. ఈ సంద్భంగా డాక్టర్ సమరం “హిస్టరీ ఆఫ్ సైన్సు ఫోటో ఎగ్జిబిషన్”ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. ఎందరో మాహానుభావుల శాస్త్రజ్ఞుల కృషిని డాక్టర్ సమరం వీడియో ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సభానంతరం విద్యార్ధులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ మారు, శ్రీమతి రశ్మి, శ్రీయుతులు, హరిసుబ్రహ్మణ్యం, కృష్ణమోహన్, డాక్టర్ శివయ్య మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap