ఈ చిత్రకారుడు ‘ప్రకృతి ‘ ప్రేమికుడు

“ప్రకృతి సహజ తైలవర్ణ చిత్రకారుడు” పేరి రామకృష్ణ గారు హైదరాబాద్ నివాసి. వీరు అలుపెరగని కళాకారుడు. చిన్నతనంలో S.S.C. తర్వాత కుటుంబ బాధ్యతలు తనపై పడటంవల్ల ముందుగ ఓ చిన్న ప్రయివేట్ ఉద్యోగంతో తన జీవన ప్రయాణం ప్రారంభమైనది. అదనంగా ఒక్కొక్కటి చదువులు పూర్తి చేసుకుంటూ, ఆ నాటి ఆంధ్రప్రదేశ్, సెక్రటేరియట్, హైదరాబాద్ లో ఉద్యోగం, తర్వాత రిటైర్మెంట్ కూడా అయ్యారు పేరి రామకృష్ణ గారు.
చిన్నతనం అంటే పది సంవత్సరాల వయసు నుండే చిత్రకళంటే, ప్రకృతి అంటే ఎంతో మక్కువ, మమకారం, ఇష్టం. ప్రముఖుల వేసిన పేయింటింగ్స్ లను చూసిన ప్రతిసారీ తనలోని కళను డ్రాయింగ్ రూపంలో బయటకు రావడం, మెల్లమెల్లగా పేయింటింగ్స్ లను వేయడం మొదలయ్యింది. ఎక్కువుగా ప్రకృతికి సంబంధించిన పేయ్ంటింగ్స్ లను మాత్రమే వేసేవారు, వేస్తున్నారు.

విశేషం ఏమిటంటే, రామకృష్ణ గారు చేసిన పేయింటింగ్ ను చూస్తుంటే, ఆ పేయింటింగ్ లోని దృశ్యం “నిజంగానే మన కుటుం సమేతంగా యాత్రలకు వెళ్లి, అక్కడక్కడ చుట్టు పరిసరాల ప్రాంతాలన్నీ తిరుగుతూ, ఏదో ఒక ఎతైన కొండమీద నిలబడి, దట్టమైన అడవి ప్రాంతం, ఎదురుగా పచ్చదనంతో కూడిన దృశ్యాన్ని చూస్తున్నామా ? అన్నంతగా భ్రమలో వుంటాము”. నిజానికి మనం ఏ యాత్రకు వెళ్లలేదు. ఎతైన కొండపైనా లేము. కళ్లకు ఎదురుగా ఎలాంటి పచ్చదనం లేదు. మన కళ్ళు మనల్ని మోసం చేసాయి అంతే. నిజానికి మనం చూస్తున్నది మాత్రం అక్షరాలా ఓ పేయింటింగ్ మాత్రమే. ప్రకృతిని సహజంగా చిత్రించడంలో ఆ శైలి, ఆ పట్టు, ఆ కనికట్టు రామకృష్ణ గారి ప్రత్యేకత. అందులో “Save Greenery and Save Environment” సందేశం ఉంటుంది. అలాంటి ప్రత్యేకత ఉండటం వలన లెక్కకు మించి అవార్డులతో పాటు, అయిదు ప్రపంచ రికార్డులను కూడా సాధించారు.

ఉద్యోగం చేస్తూనే శెలవులలో, తీరికవేళలో నిత్యం రేయింబవళ్ళు అన్న తేడా లేకుండా, పేయింటింగ్స్ లను చేస్తూనే వుంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు తృప్తిగా ఉన్నప్పటికీ, మిగతా కళాకారుల వలే అన్ని రకాల చిత్రాలు, డ్రాయింగులు, పోర్ట్రయిట్ వంటి పనులు చెయ్యలేకపోతున్నానని కించిత్ అసంతృప్తిని వెళ్లడించారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో “గొప్ప ప్రకృతి ప్రేమికుడు” గా ఎదగాలని వారి ఆశయంగా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే “ప్రకృతి అంటే రామకృష్ణ-రామకృష్ణ అంటే ప్రకృతి” అన్న మాటగా గుర్తింపు రావాలని మనసులోని మాట అన్నారు.
ఈ మధ్య ఇంటర్నేషనల్ స్థాయిలో Lights Space Time (USA) కొరకు 25 దేశాలనుంచి, 550 ఎంట్రీస్ లలో పేరి రామకృష్ణ గారి పేయింటింగ్ కు Landscapes Artist నుండి Specal Recognition “RAMA”S Temple పేయింటింగ్ కు ఈ అవార్డును తీసుకున్నారు. అందులకు నా జీవితం, నా జన్మ ధన్యమైనదని ఎంతో సంతోషంగా చెప్పారు.

చివరిగా చిత్రాలు సామాన్యులకు కూడా అర్థమై, అందులోని అందాన్ని, నైపుణ్యతను ఆస్వాదించేలా ఉండాలని, నేటి తరానికి, వారి వారి రంగంలో కృషితో తప్పకుండా అతి పెద్దస్థాయిలో తెచ్చుకోవాలని సందేశాన్ని ఇచ్చారు..

SA: