మూగబోయిన అందెల సవ్వడి …

ప్రముఖ నృత్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి మంగళవారం(31-3-20) రాత్రి విజయవాడలో నటరాజ సన్నిధికి చేరుకున్నారు. కృష్ణ జిల్లాకు చెందిన అన్నపూర్ణ అటుకూచిపూడి, ఇటు భరత నాట్యంలోనూ నిష్ణాతులు.
ఒక శకం ముగిసిపోయింది ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రెసిడెంట అవార్డీ,,రెసేర్చ్ స్కాలర్.. హంస అవార్డ్ గ్రహీత.. కృత్రిమ కాలితో వేల ప్రదర్శనలు ఇచ్చిన నాట్యమయూరి .. లంక అన్నపూర్ణాదేవి. చిరు ప్రాయం లోనే కూచిపూడి నాట్యం లో అడుగుపెట్టిన అన్నపూర్ణ గారు. నాట్యానికి , నాట్యం ద్వారా దేశానికి చేసిన సేవ ఎనలేనిది.. ఆనాడు యుద్ద సమయం లో దేశ రక్షణ కోసం ఆమె చేసిన సేవా అనిర్వచనీయం.. సత్యభామ కు నిలువెత్తు నిదర్శనం ఆమె.. ఆమె రూప లావణ్యం , నాట్య పద విన్యాసాలతో, తన సొంత గాన మాధుర్యం తో ఎన్నో నాట్య ప్రదర్శనలు చేశారు.. అంతే కాక ఎంతో మందికి నాట్యం లో శిక్షణ ఇచ్చి, స్ఫూర్తి దాయకం గా నిలిచిన ఆమెకు ఎన్నో అవార్డులు, సత్కారాలు కలికితురాయి గా నిలిచాయి.. కొన్నాళ్లుగా విజయ ఓల్టేజ్ హోమ్ లో ఉన్న ఆవిడను అల్లుడు లాయరు విశ్వనాథ్ చూసుకుంటున్నారు. అనారోగ్యం తో మరణించిన ఆమెకు ఈ ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో లంక లక్ష్మినారాయణ, సుబ్బ లక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన అన్నపూర్ణ డీగ్రీ వరకు చదువుకున్నారు. ఒక రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా కృత్రిమ కాలుతో సుమారు 200 నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. విజయవాడ ఘంటశాల మూజిక్ కాలేజీలో డ్యాన్స్ టీచర్ గా పనిచేసి 2006 లో పదవీవిరమణ చేసారు.

__________________________________________________________________
ఆమె మరణం తీరని లోటు.. –
కూచిపూడి నాట్యానికి ఆమె మరణం తీరని లోటు.. అంతటి గొప్ప మహనీయులురాలు నాకు గురువు అవ్వడం నా జన్మ జన్మల సుకృతం.. ఈ రోజు ఆవిడ మన మధ్య లేరనే విషాదం చాలా బాధాకరం.. ఈ రోజు నేను ఒక గురువుగా ఎందరికో విధ్యనేర్పిస్తున్నా…., నా తల్లితండ్రుల గర్వించగల స్థాయిలో ఉండగలిగాను అంటే ఆమె వద్ద నేర్చుకున్న నాట్యం కారణం. .. శిష్యురాలు గా ఆవిడ చివరిచూపుకు కూడా నోచుకోలేక చింతిస్తున్నాను.. అమ్మా…… ఇవిగో! అందుకో నా కన్నీటి నాట్యాంజలి….
-భావన  (శిష్యురాలి కన్నీటి నివేదన)

SA: