నవ సాహితీ ఇంటర్నేషనల్ & కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (జనవరి 4న) విశాఖపట్నం, కళావేదికవారి పుస్తకాలయ ప్రాంగణంలో జరిగిన వినూత్న కవిసమ్మేళనం తొందరపడి ఒక కోయిల ఎంతోమంది కవుల కవితా గానాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి మాన్యులు దాడి వీరభద్రరావుగారు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు గారు, డా. నండూరి రామకృష్ణ గారు, ఎస్.వి. సూర్యప్రకాశరావుగారు, వెలమల సిమ్మన్న గారు, ఘండికోట విశ్వనాథం గారు, శ్రీమతి సుహాసిని గారు, మేడా మస్తాన్ రెడ్డి గారు, శ్రీమతి సుధారాణి గారు వంటి ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు, కవితల పోటీకి శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపికచేసారు.
ప్రధమ బహుమతి: పురుషోత్తం శ్రీనివాసరావు గారు,
ద్వితీయ బహుమతి: గణేశ్వర్రావు గారు,
తృతీయ బహుమతి: కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు,
ప్రోత్సాహక బహుమతి: డాక్టర్ పి.అప్పారావుగారు,
విజేతలకు అతిధుల చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని, పుస్తక బహుమతిని అందజేయడం జరిగింది, పాల్గొన్న కవులందరీకీ నవసాహితీ ఇంటర్నేషనల్ తరఫున ప్రశంసా పత్రాలు అందచేసారు.
ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ గా డా. కూన కాళిదాసు గారు వ్యవహరించగా, ఈ కార్యక్రమాన్ని నవసాహితీ (AP chapter) విశాఖపట్నం కార్యదర్శి డాక్టర్ గోపీచంద్ గారు, నవసాహితీ సీనియర్ సభ్యులు యడవిల్లి సుధాకర్ గారు నిర్వహించడం జరిగింది, అతిధులను తన చక్కని పదజాలంతో డా.జి.మాలతి గారు ఆహ్వానించి కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమణి (నేను) వ్యవహరించడం జరిగింది. ఈ సభలో 60 మంది కవులు కవితా గానం చేశారు. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సూర్యప్రకాశరావుగారికి, ఆతిథ్యాన్ని అందించిన నండూరి రామకృష్ణ గారికి మరొక్కసారి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
–సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)
వినూత్నమేమితో మీ నివేదికలో చెప్పలేదు.
వినూత్నమేమి టో చెప్పలేదు.