‘NCCF’ వారి కార్టూన్ల పోటీ ఫలితాలు

హాస్యానందం పత్రిక మరియు యన్.సి.సి.యఫ్. వారి కార్టూన్లపోటీ-2024 లో బహుమతి పొందిన విజేతలను ప్రకటించారు. విజేతలందరికి అభినందనలు.
క్రోధినామసంవత్సర ఉగాది సందర్భంగా యన్.సి.సి.యఫ్ వారు నిర్వహించిన పోటీకి 72 మంది కార్టూనిస్టుల నుండి 194 కార్టూన్లు అందాయి.
వీటిలో బహుమతులకు అర్హమైన కార్టూన్లను న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సీనియర్ కార్టూనిస్టు బి.యస్. రాజు గారు మరియు నిర్వాహకులబృందం కలిసి ఎంపికచేయడం జరిగినది.
5 కార్టూన్లకు 1000 రూపాయలు చొప్పున మరియు 35 కార్టూన్లకు 200 రూపాయలు చొప్పున బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులందరికీ మా ధన్యవాదాలు.

5 కార్టూన్లకు 1000 రూపాయలు చొప్పున గెలుపొందిన వారిలో…
1. నాగిసెట్టి,
2. సునీల్,
3. ప్రేం,
4. ప్రసాద్ కాజ
5. ఎస్.వి. రమణ వున్నారు.

ప్రోత్సాహక బహుమతులుగా (ఐదింటికి 200/- మరో ఐదింటికి 100/- బహుమతులు)

200 రూ జ్యూరీ (5)
ఏ.యమ్. రావు
సౌమ్య
సురేంద్ర
సురేష్
యమ్.యస్.వి.

100 రూ జ్యూరీ (5)
బాషా
రామ్ మహేష్ (కర్ణాటక)
గాదె రమేష్
జియస్ కే (అనకాపల్లి)
మన్నవ సిస్టర్స్

SA:

View Comments (1)

  • థాంక్యూ.. కళాసాగర్ గారు..

    మరోసారి నాకు బహుమతి నిచ్చి సత్కరించారు NCCF విశాఖపట్నం వారు.
    దానికి ప్రాచుర్యం కల్పించారు మీరు..
    మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.
    పారితోషికాలు లేక క్షీణించిపోతున్న కార్టూనింగ్ కళకి ఇలాంటి కార్టూన్ పోటీలే కాస్తంత ఊపిరి పోస్తున్నాయి.

    లేకపోతే ఇప్పటికే ఈ కళ కాలగర్భంలో కలసిపోయి ఉండేది.

    మరొకసారి ధన్యవాదాలు.