‘ఈ కాలంలో నాటకాలా… అబ్బె ఎవడు చూస్తడండి,
ఒకవేళ చూద్దామన్నా… మంచి నాటకాలు ఎక్కడున్నయ్ చెప్పండి’
అనే మాటలు మనం వింటుంటం.
పారిశ్రామీకరణ ప్రారంభమై, క్యాపిటలిజం వేళ్లూనుకునే సమాజంలో మనిషి ఏవిధంగా యంత్రం కాబోతున్నాడో, మానవ సంబంధాలూ ఏ విధంగా యాంత్రికం కాబోతున్నాయో ఆనాడే, చార్లీ చాప్లిన్ మోడ్రన్ టైమ్స్ లో చూపిస్తే, చూసి మర్చిపోయాం. కమ్యూనిస్టు రాజ్యాలు కుప్పకూలడం, ప్రజాస్వామ్యాలు ఒంటి కాలు మీద నడవడం, ఫ్యాక్టరీలు, సెజ్జులు, మాల్ ల మాయాజాలంతో కార్పొరేట్ శక్తుల విజృంభన..మొదలైన పరిణామాల తాకిడిలో మనిషి మనుగడే ప్రశ్నార్థకమై కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఉన్నామిప్పుడు. మేడిపండు లాంటి గ్లోబలైజేషన్ కోరల్లో కులవృత్తులను నమ్ముకున్న బడుగు జీవులు సమిధలై పోతున్న అన్యాయమైన కాలంమిది.. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం..సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు చరిత్రలో భాగమైపోతున్నాయి. ఆఖరికి పదిమందికి అన్నం పెట్టే రైతు కూడా రైతుకూలీ గా మారిపోతున్నాడు.. ఎంతటి విషాదం! అయినా ఏ చలనం లేకుండా బతికేస్తున్నాం!?
వాటన్నింటికి సమాధానమే మా ‘న్యూ బాంబే టైలర్స్’ నాటకం.
ఇది నాటకం మాత్రమే కాదు, కులవృత్తుల మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళ జీవితం. కంపెనీ రక్కసి కన్నుపడి టైలర్ల బతుకులు ఎట్ల ఛిద్రమయ్యాయో చూపించిన నాటకం.
నిన్నరాత్రి(23-3-2021) గచ్చిబౌలిలోని రంగభూమిలో నాటకం చూసిన. 7గంటల నుండి 8.30దాకా సాగిన నాటకం హౌస్ ఫుల్ కలెక్షన్ తో అదరగొట్టింది.
బషీర్ దర్శకత్వ ప్రతిభ, నటీనటుల ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తోపాటు, పీర్ భాయ్ గా మా బాషా సార్ నటనానుభవం నాటకాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లింది.
తెలుగు నాటకం మార్పును, నాటకంలో పాటలు డ్యాన్సులను కోరుకునేవాళ్ళకి ఈ నాటకం ఒక విందు భోజనం.
జీవితాన్ని పెద్దగా చూపించేది ‘సినిమా’
జీవితాన్ని చిన్నగా చూపించేది ‘టీవీ’
జీవితాన్ని జీవితంలా చూపించేది ‘నాటకం’.
సో, మీకు ఒక (మనందరి) జీవితాన్ని చూపించేందుకు మా టీం రెడీ. మీరు రెడీనా.
అయితే, గచ్చిబౌలిలోని రంగభూమిలో ఈరోజు (24-03-2021) ఏడు గంటలకు ప్రదర్శన ఉంది.
రండి, ఆ జీవితాన్ని దగ్గరగా చూస్తూ
ఆనందాల్ని – నవ్వుల్ని
ఆప్యాయతని – అనురాగాన్ని
ఎదురీతను – నమ్మకాన్ని
పంచుకుందాం, పెంచుకుందాం.
టిక్కెట్టు: రూ. 250/-
మూల కథ: Mohammed Khadeerbabu గారు
నాటకీకరణ: Indla Chandrasekhar అన్న
రంగాలంకరణ: Rajiv Velicheti సర్
పాటలు, స్వరకల్పన: Anantu Chintalapalli సర్
దర్శకత్వం: Shaik John Basheer భాయ్