‘ఈనాడు ‘ కు కొత్త ఎడిటర్

ఈ రోజు ‘ఈనాడు ‘ పత్రికలో మార్పు గమనించారా? ఈనాడు కు కొత్త ఎడిటర్లు వచ్చారు. ఇక రామోజీరావు గారు కేవలం ఫౌండర్ మాత్రమే… ఎడిటర్లుగా తెలంగాణ ఎడిషన్లో డీ.ఎన్. ప్రసాద్ పేరు, ఏపీ ఎడిషన్లో ఎం.నాగేశ్వరరావు పేరు కనిపిస్తున్నాయి… నిజం… ఇన్నేళ ఈనాడు చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఎడిటర్ తప్పుకున్నాడు… ఇద్దరు సంపాదకులు వచ్చారు.. వాళ్లిద్దరూ ఈనాడులో చాలా సీనియర్లు.. ఆటుపోట్ల నడుమ ఈనాడునే అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు… ఇది మంచి నిర్ణయమే… అయితే ఒక పత్రికకు వేర్వేరు చోట్ల వేర్వేరు సంపాదకులు ఉంటారా..? రెసిడెంట్ ఎడిటర్లు ఉంటారా..? ఏమోలెండి…
కానీ ఇన్నాళ్ల నాన్ వర్కింగ్ జర్నలిస్టు చీఫ్ ఎడిటర్‌గా ఉన్న కాలం మారిపోయి ఒక్కసారి ఇద్దరు వర్కింగ్ జర్నలిస్టులు ఎడిటర్లు అయ్యారు.. అది విశేషం… అవునూ, ఏమిటీ వైపరీతం..? ఏమిటీ అసాధారణ నిర్ణయం ..? ఇలాంటి స్థితే వస్తే రామోజీరావుకు అత్యన్త సన్నిహితులం, మేం ఎడిటర్లు అవుతాం అని ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు ఎందుకు పక్కకు నెట్టేయబడ్డారు..? కారణం..? సరే, అదీ వాళ్ల అంతర్గతం…
రామోజీరావు ఇష్టం…. అయితే..?
ఎడిటర్లకు వయోపరిమితి వర్తిస్తుందా..? ఈ ఇద్దరూ రిటైరయ్యారా.? లేక ఎటెండెడ్ సర్వీసు మీద ఉన్నారా అనేది ఒక ప్రశ్న… అదీ సంస్థ ఇష్టం అనుకుంటే… ఒకవేళ రామోజీరావు చీఫ్ ఎడిటర్ పోస్టు ఖాళీ అయ్యేపక్షంలో… ఇన్నాళ్లూ అందరూ అనుకున్నదేమిటీ అంటే..?
రామోజీరావు వారసుడు కిరణ్… తను ఇప్పుడు ఎండీ… తనే చీఫ్ ఎడిటర్ ప్లేసులోకి వచ్చి, ఎప్పటిలాగే సంస్థ నడుస్తుంది అనుకున్నారు… ఇన్నేళ్లుగా తనూ ఫీల్డులోనే ఉనం్నదున పెద్ద తేడా కూడా ఏమీ ఉండదు..
కానీ జరిగింది వేరు.. నిజానికి తన చివరి క్షణాల వరకూ చీఫ్ ఎడిటర్‌గా ఉండాలనేది రామోజీరావు కోరిక… ఈనాడు అంటే అంత ప్రాణం తనకు..! మరి ఏమిటీహఠాత్పరిణామం..?
బయటికి చెప్పే కారణాల్లో ఒకటి.. ఆయనకు వయస్సు మీద పడింది.. సంపాదక బాధ్యతలు కష్టం అవుతున్నాయి… అయితే ఈ రోజు వరకూ తను చీఫ్ ఎడిటర్‌గా డేటుడే అఫయిలో ఏమీలేడు…… అంతా సంస్థలో నిర్మితమైన సుశిక్షితమైన వ్యవస్తే నడిపిస్తూ వస్తున్నది… ఇప్పుడూ అలాగే నడిచేది కదా.. కేవలం వయస్సు, ఆరోగం, అనేవి కారణాలు కాకపోవచ్చు… మరి..? రాజకీయాలు వేగంగా మారిపోయాయి… కేసీయార్ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, ఒకవేళ ఎవరైనా టీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే, కేసీయార్ కోపం నషాళానికి గనుక అంటితే పరిణామాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ బేస్డ్ జర్నలిస్టులందరికీ, మీడియా పెద్దలందరికీ తెలిసిందే. దీనికి మించి జగన్..! అప్పట్లో సాక్షి వర్సెస్ ఈనాడు పోరాటం విపరీతంగా ఉన్న కాలంలో అకస్మాత్తుగా జగన్ రామోజీ వద్దకు వెళ్లి సయోధ్య భేటీ వేశాడు… ఆ పోరాటతీవ్రత తగ్గింది…
కానీ ఇప్పుడు జగన్ తన కత్తులకు పదును పెడుతున్నాడు… ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు… ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నాడు… ఏమాత్రం వ్యతిరేక వార్త వచ్చినా సరే, కుమ్మేయాలంటూ ప్రత్యేకంగా 2430 జీవోయే తీసుకొచ్చాడు…
జాతీయ స్థాయిలో నిరసన కనిపించినా, డంట్ కేర్ అన్నాడు.. ఈనాడు కొద్దిరోజులు ఆ జీవో మీద పోరాటం చేసి, ఇక వదిలేసింది… ఈ స్థితిలో ఏ వ్యతిరేకవార్తనో పట్టుకుని జగన్ గనుక క్రిమినల్ నేచర్ డిఫేమేషన్ కేసు వేస్తే ముందుగా ఇరుక్కునేది ఎడిటర్, పబ్లిషర్… ఈ స్థితిలో రిస్క్ అవసరమా..? (గతంలో ఓ కేసులో ఆంధ్రజ్యోతి ఎడిటర్ జైలుపాలయ్యాడు నాలుగురోజులపాటు…
కానీ రాధాకృష్ణ సేఫ్… ఇప్పుడూ ఏవైనా కేసులు పడితే ఈనాడు తరపున ఫేస్ చేయాల్సింది ఈ ఇద్దరు ఎడిటర్లే..)
అసలే రామోజీరావు దగ్గరి బంధువు నవయుగను జగన్ మామూలు దెబ్బలు కొట్టడం లేదు… సో, గత మర్యాదలు, మన్ననలు ఇప్పుడు జగన్ ఏమాత్రం పట్టించుకునే స్థితి లేదు.. మరోవైపు కేంద్రంలోని బీజేపీతోనూ ఈనాడుకు ఇప్పుడు పెద్దగా మంచి సంబంధాలు లేవు… సో, ఈ వయస్సులో చీఫ్ ఎడిటర్ అనే పోస్టులో ఉండటం రిస్క్ అనుకున్నట్టున్నారు.. ఇదీ ఓ మిత్రుడి విశ్లేషణ.. అది నిజం అయినా కాకపోయినా… తను సంపూర్ణంగా ఈనాడు నుంచి రిటైరవుతూ రామోజీరావు గారు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap