“NEWSBAZAR9.COM” వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి
ప్రింట్ మీడియా కు ఆదరణ తగ్గుతుండడంతో వెబ్ పత్రికల వైపు మరలుతున్నారు కొందరు జర్నలిస్టులు. నిర్వహణా భారం కూడా తక్కువగా వుంటుంది కాబట్టి ఇటు వైపు ఆశక్తి చూపిస్తున్నారు. రెండు దశబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ అనతికాలంలోనే తెలుగువారి ఆధరాభిమానాలు చూరగొనాలని NEWSBAZAR9.COM వెబ్‌సైట్‌ను మెగాస్టార్, కేంద్ర మాజీ పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి ఈ రోజు తన నివాసంలో లాప్‌టాప్ ద్వారా ఆన్‌లైన్‌లో క్లిక్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
నమ్మకం, వాస్తవం, వేగం, ప్రామాణికమైన సమాచారం మరియు స్వచ్చమైన తెలుగు వార్తల కోసం “NEWSBAZAR9.COM” తప్పకుండా అందరూ ప్రతిరోజు చదవండి.
NEWSBAZAR9.COM వెబ్‌సైట్‌ను పరిశీలించిన మెగాస్టార్ చిరంజీవి వాస్తవాలతో కూడిన ప్రామాణికమైన వార్తలను అందిస్తూ తెలుగువారికి మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కరోనావైరస్ విలయ తాండవం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో కూడా స్టార్టప్ సంస్థలను, యువతను ప్రోత్సాహించడానికి మెగాస్టార్ చిరంజీవి NEWSBAZAR9.COMను ప్రారంభించడం ఆయనలోని మంచి మనస్సును చాటి చెబుతోంది.