ఎన్టీఆర్ ‘అవతార పురుషుడు’ గ్రంథావిష్కరణ

ఎన్టీఆర్ శజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన అరుదైన పుస్తకం ‘అవతార పురుషుడు’ గ్రంథమని సినీమాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు. ఆయన తెనాలి ఎం.ఎస్. పాలెంలోని వి.జి.కె.వి.వి.ఎల్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రంధావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రవాస భారతీయుడు బాబు ఆర్. వడ్లమూడి ప్రచురణకర్తగా వ్యవహరించారు. పుస్తకాన్ని ఉచితంగా అందించడం అభినందనీయమని సాయిమాధవ్ కొనియాడారు. గ్రంథ రచయిత, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ చేసిన ఈ ప్రయత్నం వినూత్నమని ఆయన కితాబిచ్చారు. ఎన్ఆఆర్ఎస్ఐ బాబు, అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, పౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్, రచయితలతో కలిసి ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

304 పేజీల ఈ పుస్తకంలో సుమారు 400 అపురూపమైన ఛాయాచిత్రాలు పొందుపరిచారు జానీ. ప్రతులకు 9949429827 నంబరులో సంప్రదించండి.

SA: