వెండితెర వేలుపు ఎన్టీఆర్ – మండలి

“కళ, రాజకీయ రంగాలల్లో తెలుగుజాతి ప్రతిభాపాటవములను, వైభవాన్ని విశ్వవ్యాప్తము చేసిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు జీవితచరిత్రను చారిత్ర కోణములో నాట్య శాస్త్ర ప్రమాణాలతో చాలా లోతైన పరిశోధన గావించి కొన్ని సంపుటాలను తెలుగు జాతికి ఓ అపూర్వ కానుకగా అందించుతున్న సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు చేస్తున్న కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది” అని పూర్వ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ కొనియాడారు.

ఈ సందర్భముగా గ్రంధకర్త మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఎన్టీఆర్ పుట్టిన పెరిగిన, ఆయనకు అనుబంధం వున్న ప్రాంతాలను సందర్శించి, వారితో ప్రత్యక్ష పరిచయమున్న బంధుమిత్ర సహచరులను, నటీనట సాంకేతిక నిపుణులను స్వయంగా కలసి సేకరించిన సమాచారముతో నందమూరి వారి చరిత్రను అందించుతున్నట్టు” తెలిపారు.

అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగిన మండలివారి జన్మదిన వేడుకలలో మన్నె రచించిన ఎన్టీఆర్ జీవితచరిత్ర తొలి భాగం “వెండితెర వేలుపు నందమూరి తారక రామారావు” పుస్తక ముఖచిత్రాన్ని ఆవిష్కరణ గావించారు.

SA: