కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

(తెలుగు నేలపై క్యారికేచర్ పోటీలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ప్రకటించడం శుభపరిణామం…)

తెలుగుజాతికీ, తెలుగుభాషకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాలు మూడువందల పై చిలుకు చిత్రాలు చేసారు.

తెలుగు వారి “ఆత్మగౌరవ నినాదం”తో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. తన హయంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు..బడుగు, బలహీన వర్గాలకి రాజ్యాధికారం కలిగించిన మహానుభావుడు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగు వ్యక్తీ కొనియాడే నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు.
తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరిట కలయిక ఫౌండేషన్ (హైదరాబాద్ ) క్యారికేచర్ మరియు కవితల పోటీ నిర్వహిస్తోంది.

క్యారికేచర్ పోటీ
“నందమూరి తారక రామారావు – వ్యక్తిత్వం” అనే అంశం తో అంతర్జాతీయ caricature పోటీలు నిర్వహిస్తున్నాం.మొదటి బహుమతి 1,00,000-00 (ఒక లక్ష) రూపాయలు, రెండవ బహుమతి 75,000-00(డెబ్బై ఐదు వేలు) వేల రూపాయలు, మూడవ బహుమతి 50,000-00(యాభై వేలు)వేల రూపాయలు అలాగే ఐదు ప్రత్యేక బహుమతులు 10.000(పది వేలు) వేల రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది.
అలాగే ఎంపిక కాబడిన క్యారికేచర్ చిత్రాలను పుస్తక రూపంలో రంగుల్లో ముద్రించి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ప్రదానం చేస్తాము. అలాగే పుస్తక ప్రచురణకు ఎంపిక కాబడిన వారికి పుస్తకం ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఎంపిక చేయబడిన క్యారికేచర్లతో ప్రదర్శన కూడా నిర్వహించే అవకాశం ఉంది.

నిబంధనలు :
1) ఒక్కరు ఒకటి లేదా మూడు వరకు క్యారికేచర్లు పంపవచ్చు.
2) క్యారికేచర్ తో పాటు నందమూరి తారక రామారావు వ్యకిత్వం ప్రతిబింబించేలా ఉంటే మంచిది.
3) A 4 సైజులో 300 DPI, CMYK ఫార్మాట్ లో చింత్రిచాలి.
4) రంగుల్లో వేసిన చిత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది.
5) ఇతర వివరాలకు ఈ వాట్సాప్ No. 09346273799 కి సంప్రదించగలరు.
6) మీ చిత్రాలు ఏప్రిల్ 15 వ తేదీలోపు ఈ మెయిల్ ఐడీ ntrcaripoem@gmail.com కి పంపించాల్సి ఉంటుంది.
7) విధిగా మీ ఫోటో కూడా జతచేయడం మరిచిపోవద్దు.

కవితల పోటీ
అలాగే “నందమూరి తారక రామారావు – వ్యక్తిత్వం” అనే అంశం పేరిట కవితలు కూడా ఆహ్వానిస్తున్నాము. ఉత్తమ కవితలకు మొదటి బహుమతి కింద 25,000-00(ఇరవై ఐదు వేలు) రూపాయలు, రెండవ బహుమతి కింద 20,000-00(ఇరవై వేలు) రూపాయలు, మూడవ బహుమతి కింద 15,000-00(పదిహేను వేలు)రూపాయలు అలాగే పది ప్రత్యేక బహుమతుల కింద ఒక్కొక్కరికి 5,000-00 (ఐదు వేలు) రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా ఎంపిక చేయబడిన కవితలతో ఒక సంకలనం ముద్రించి ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.

నిబంధనలు :
1) ఒక్కొక్కరు కేవలం ఒక కవితను మాత్రమే పంపాలి.
2) మీరు పంపే ఏ ప్రక్రియ అయినా వచనంలో ఉండాలి.
3) పద్యం, గేయం మరియు మరే రూపకంలో నైనా రాయవచ్చు, కానీ గ్రాంథికంలో ఉండకూడదు.
4) మీ కవిత 20 లైనులకు మించకుండా ఉండాలి.
5) కవితలు కేవలం ఈ వాట్సాప్ నంబర్ 09346273799 కు మాత్రమే పంపాలి.
6) పేపర్ పై రాసి ఫోటో తీసి పంపిన కవితలు అనుమతించబడవు.
7) మీ కవితలు ఏప్రిల్ 10 వ, తేదీ లోపు పైన పేర్కొన్న వాట్సాప్ నంబర్కు పంపించాల్సి ఉంటుంది.
8) కవితలు కేవలం తెలుగులోనే ఉండాలి.
9) విధిగా మీ ఫోటో కూడా జతచేయండి.

అతిరథ మహారథుల సమక్షంలో బహుమతుల ప్రదానం, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్య గమనిక : పూర్తి నిర్ణయం నిర్వాహకులదే వాదాలకు సంవాదాలకు తావులేదు.

చేరాల నారాయణ
కలయిక ఫౌండేషన్ చైర్మన్,
09395355566

కళ్యాణం శ్రీనివాస్, నిర్వహణ
09346273799

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap