ఎన్టీఆర్ ‘చిత్రకళా’ శత జయంతోత్సవం

జూలై 9న, ఆదివారం విజయవాడలో జరిగిన జయహో NTR శత జయంతోత్సవ బహుమతుల ప్రధాన మహోత్సవం అధ్యంతమ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో…కన్నుల పండుగగా.. ఆత్మీయులు మధ్యలో విజయవంతంగా జరిగింది…

ఎన్టీఆర్ శత జయంతోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోనూ రాజకీయ, సాహిత్య, నాటక, నృత్య, గాన కార్యక్రమాలు అనేకం జరిగినప్పటికీ వాటికి భిన్నంగా ఎన్టీఆర్ పోట్రైట్స్ పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చి, ఎన్టీఆర్ శతజయంతోత్సవ పురస్కారాల ప్రదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత క్రియేటివ్ హార్ట్స్ ఆకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారికే చెందుతుందని సభకు అధ్యక్షత వహించిన కళాసాగర్ అన్నారు.
పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జె.ఎన్.టి.యూ. రిజిస్ట్రార్ సుందర్ కుమార్ గారు, సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్ హైదరాబాద్ నుండి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పోటీలో పాల్గొన్న చిత్రకారులు ఎంతో సుదూర ప్రాంతాల వచ్చి అతిథుల చేతుల మీదుగా బహుమతులందుకున్నారు.
ముఖ్య అతిథి , ప్రముఖ చిత్రకారుడు దాకోజు శివ ప్రసాద్ మాట్లాడుతూ…. ఎన్టీ ఆర్ తో సినీ రంగంలో కలిసి పనిచేసే అదృష్టం కలిగిందన్నారు. సామ్రాట్ అశోక్ చిత్రానికి పబ్లేసిటీ డిజైనర్ గా పనిచేసేనన్నారు.

రంగస్థల నటులు, దర్శకులు, నాటక రచయిత అయిన డా. పి.వి.ఎన్ కృష్ణ గారికి ఎన్టీఆర్ శత జయంతోత్సవ పురష్కారం అందజేశారు. వేదికపై కృష్ణ గారు మయసభలోని దుర్యోధనుని పద్యాలు పాత్రోచితంగా, రాగయుక్తంగా పాడి సభికులను అలరించారు. ఆ గొంతులో ఏదో తెలియని.. గాంభీరం.. ఆ గాత్రంలో ఏదో తెలియని అనుభూతి కలిగింది శ్రోతలకు.
ఎన్టీ ఆర్ శత జయంతి పురస్కారం అందుకున్న పి.వి.ఎన్. కృష్ణ మాట్లాడుతూ తెలుగు పద్యాలకు తన సినిమాల ద్వారా ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన ఎన్టీ ఆర్ పురస్కారాన్ని తను అందుకోవడం నటుడిగా తనకి దక్కిన గౌరవంగా భావిస్తాను అన్నారు.

పోటీకి వచ్చిన బొమ్మల్లో బహుమతి పొందిన ఎన్టీఆర్ చిత్రాలతో ఒక ప్రత్యేక సంచికను అతిథుల చేతుల మీదుగా విడుదల చేసారు.
న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జె.ఎన్.టి.యూ. రిజిస్ట్రార్ సుందర్ కుమార్ గారు మాట్లాడుతూ పోటీకి వచ్చిన బొమ్మలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి వున్నాయన్నారు. శివప్రసాద్ గారు తను కలసి విజేతలను ఎంపిక చేశామని, బహుమతి రాని వారు నిరుత్సాహపడకూడదని, ఏ పోటీలో అయినా కొందరే విజేతలుంటారని చిత్రకారులకు అభినందనలు తెలిపారు.

”జయహో NTR అనగానే … ఎంతగానో శ్రమించి చక్కని చిత్రాలు గీసి పంపి.. ఈరోజు దూర ప్రాంతాల నుండి ఎండను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమానికి శ్రమతో విచ్చేసిన ప్రతీ చిత్రకారునికి.. మిత్రులకి.. శ్రేయోభిలాషులకి… విజయవాడ పురప్రముఖ చిత్రకారులందరికీ… నన్ను ఇంత ఆధారాభిమానలతో… ఆదరిస్తున్న.. ప్రోత్సాహిస్తున్న ప్రతీ ఒక్కరికి” కృతజ్ఞతలు తెలియజేశారు నిర్వహకులు అంజి ఆకొండి.

NTR Portraits Awards function Vijayawada

SA:

View Comments (2)