నృత్య కళాభారతి 24వ వార్షికోత్సవ సంబరాలు 25 డిశంబర్ 2022 ఆదివారము సాయంకాలం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నందు ఘనంగా జరిగాయి.
నృత్య కళాభారతి 24 వ వార్షికోత్సవ సందర్భంగా 85 మంది విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఇందులో ప్రత్యేక అంశము ఓం శ్రీ నమో వెంకటేశాయ తిరుమల విశేష ఘట్టాలతో బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ లతో ఆకర్షవంతమైన లైటింగ్ లతో చేసిన ప్రదర్శన అందరి మదిలో భక్తి భావన నెలకొల్పే లాగా ప్రదర్శన జరిగినది.
ఈ కార్యక్రమానికి సాయి ప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ శ్రీమతి డాక్టర్ కే.నలిని గారు, విస్డం చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి డి. మీనాగారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ కాజా వెంకట సుబ్రహ్మణ్యంగారు సభ అధ్యక్షులుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి శుభ గృహ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎం.డి. శ్రీమతి నంటూరి వసంత కుమారిగారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వి.వి.ఐ. టి చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బృందావన గార్డెన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ మస్తానయ్యగారు గౌరవ అతిథిగా విచ్చేశారు. ఇక హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావుగారు, ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. వీరందరూ నృత్య ప్రదర్శనలు మొదటినుంచి నుంచి చివరిదాకా వీక్షించారు. అనంతరం వీరిని నృత్య కళాభారతి వారు వేదికపైకి పుష్పగుచ్చాలతో ఆహ్వానించింది. వారి వారి స్పందనలు ఎంతో ఆనందంగా తెలియజేశారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు అతిథులు విశిష్ట అతిధులు గౌరవ అతిధులు, ఆత్మీయ అతిథులు వీరి చేతుల మీదుగా జ్ఞాపకం ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
కీర్తిశేషులు ఎన్. కనకాచారి గారిచే స్థాపించబడిన నృత్యకళా భారతి ఆయన కుమారుడు ఎన్. బాలుగారు మాట్లాడుతూ సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే మానవునికి భగవంతుడు భిన్నంగా ఇచ్చిన వరం హృదయ స్పందన 64 కళలలో మధుర భావన కలిగించేది నాట్యం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇది జగమెరిగిన సత్యం. అటువంటి నాట్య కళామతల్లిని ఆరాధించే నాట్యాచార్యులు కీర్తిశేషులు ఎం. కనకాచారిగారితో స్థాపించబడినది. అలా స్థాపించబడిన నృత్య కళాభారతి 24వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ప్రతి వార్షికోత్సవం ఒక ప్రత్యేక అంశములను అలరించడానికి ప్రయత్నం చేస్తుంది. రాబోయే 25వ వార్షికోత్సవాన్ని ఇంకా ఘనంగా ప్రత్యేక అంశములతో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గాత్రం శ్రీ సూర్యనారాయణగారు, మృదంగం తిరునగరం ప్రభాకర్ మాస్టర్ గారు, కీబోర్డు తిన్నలూరి హరిబాబుగారు, తబలా బాలాజీ గారు, ఫ్లూట్ కుమార్ గారూ వాయిద్య సహకారం అందించారు. శ్రీ ఆచారి తెనాలి సోమశేఖర్, తోట శ్రీను రాయి రాజుగారు నృత్యాలంకరణ కావించారు. శ్రీమతి డాక్టర్ కుసుమ గాయత్రిగారు, శ్రీమతి వై. రాజశ్రీ గారు, శ్రీ ఎం. రమేష్ గారు, శ్రీ వి. మల్లికార్జునచారిగారు శ్రీ డి. వెంకట్ గారు ఆత్మీయ సహకారం చేశారు.
ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామిగా నాట్య విశారద ఎన్. బాలుగారు, ఆయన సతీమణి నాట్యచారిని శ్రీమతి నవ్య శ్రీ గారు పద్మావతి దేవిగా అలరించారు. ఈ కార్యక్రమం మొదటినుంచి చివరిదాకా విజ్ఞాన మందిరం వీక్షకులతో కిక్కిరిసి పోయింది. వీక్షకులు ఎంతో సంతోషంతో ఆనందంతో వీక్షించారు. వారి సంతోషాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిలను చూసినట్టుగా ఉందని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చివరిగా వందన సమర్పణతో అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించేశారు.
-మల్లికార్జునచారి
చాలా సంతోషంగా ఉంది. ఈ సారి తప్పనిసరిగా నేను రావటానికి ప్రయత్నం చేస్తానండి.