ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మితే ?

థియేటర్లలో టికెట్లు కూడా జగన్ అమ్ముతున్నాడు అని తిట్టేవారికి అర్ధం కానిదేమంటే, ఇది నిర్మాతలకు నష్టం కాదు అని…. ఈ విషయం పట్ల కన్సర్న్ వ్యక్తం చేసేవారు రెండు విషయాల పట్ల వ్యక్తం చేస్తున్నారు…. థియేటర్ల బిజినెస్ పోతుందని, సినిమా నిర్మాణాలు ఆగిపోతాయని….

థియేటర్ల ద్వారా ప్రభుత్వానికి మునిసిపల్ టాక్స్, టికెట్స్ మీద కమర్షియల్ టాక్స్ వస్తుంది…. వైఎస్సార్ స్లాబ్ సిస్టమ్ ఎత్తేశాక థియేటర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది…. ఏ థియేటర్ ఎన్ని టికెట్లు అమ్మిందో ఎవరూ వచ్చి చూడరు కాబట్టి…. ఆన్లైన్ పద్దతి వచ్చాక ఆన్లైన్ లో అమ్మే టికెట్స్ మీద మాత్రమే టాక్స్ కట్టి మిగిలినవి ఎగ్గొడుతున్నారు…. అన్ని టికెట్స్ ఆన్లైన్ లో ప్రభుత్వమే అమ్మితే ఎంత అమ్ముతున్నారు, ఎంత టాక్స్ వస్తుంది అనేది తెలుస్తుంది…. ఆదాయం ఎక్కడికీ పోదు…. మొన్న “రెండు సీట్లకు పోటీ చేసి ఓడిపోయిన సినిమా నటుడి” కొత్త సినిమా టికెట్ మొదటి రోజులు 5 వేల రూపాయల దాకా పోయిందని చూశాం…. ఈ గులానందం ఉన్న వారి మధ్య పోటీ ఉంటే 10 వేల దాకా కూడా పోవచ్చు…. ఇదంతా హైప్…. దానికి బలయ్యేది పరిణతి లేని భావోద్వేగపరులే.

మరి వాటి మీద టాక్స్ ప్రభుత్వానికి వచ్చిందా? రాదు…. రావాలి కదా…. ఎక్కువ రేట్లకు అమ్ముకునే అనుమతి ప్రభుత్వం ఇచ్చినప్పుడు దానికి కూడా ఆదాయం ఉండాలి…. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటే ఇలాంటి వింత, వికృత పోకడలు ఉండవు. థియేటర్ల వ్యవస్థలో ఒక డిస్సిప్లిన్ వస్తుంది. ఆ నలుగురి గుత్తాధిపత్యం థెయేటర్ల మీద ఉండదు. కరోనా కాలంలో ఆ నలుగురు థియేటర్ల అద్దె డబ్బు చెల్లించక థియేటర్ యజమానులు నష్టపోయారు. అలాటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. ఇంకా సహేతుక మార్పులు అవసరమైతే సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరపచ్చు.

సినిమా నిర్మాణాలు ఆగిపోతాయనే భయం రెండవది. థియేటర్లు ఆ నలుగురి చేతుల్లో లేవు అనుకుంటే నాణ్యత ఉన్న చిన్న సినిమాల నిర్మాణం పెరుగుతుంది. ప్రతిభ చూపించిన చిన్న సినిమాలు ఆడడానికి థియేటర్లు లేవు అని నిరసన వ్యక్తం చేసిన వారికి ఓటీటీ ల రూపంలో కూడా మంచి ప్లాట్ఫారం దొరికింది. కొత్త నటులు, కొత్త సాంకేతిక నిపుణులు, కొత్త రచయితలు, కొత్త దర్శకులు పుట్టుకొస్తారు. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో ఉన్న అగ్రనటులు పారితోషికం తగ్గించుకునే అవకాశం ఉంది. “మూడు ఫైట్లు, మూడు పాటలు ఒక ఐటమ్ సాంగ్” లాంటి మూస పోయి కొత్త కథాంశాలు, మనం ఇప్పటిదాకా వినని సంభాషణలు, మన జీవితాలనే సినిమాలుగా చూస్తాం. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల విభిన్న చిత్రాలు చేయలేకపోతున్నాం అనే ఎదవ స్టేట్మెంట్లు వినం. సినిమా నిర్మాణంలో ఒక క్రమశిక్షణ వస్తుంది.

సినిమాలో సగం బడ్జెట్ పారితోషికాలకు, ఆ సగంలో 80 శాతం అగ్రనటుడికి మాత్రమే చెల్లిస్తున్నప్పుడు దానిలో మళ్లీ ఆ అగ్రనటుడికి టాక్స్ ఇబ్బంది లేకుండా చాలా వరకు కాష్ (బ్లాక్ లో) ఇస్తున్నప్పుడు నిర్మాతకు మనం ఊహిస్తున్న దానికంటే ఎక్కువ నష్టం వస్తుంది…. కొత్త వేదికలు దొరికినప్పుడు నిర్మాతలకు ఫలానా వారితోనే తీయాలి అనే అనివార్యత ఉండదు…. నిర్మాతల్లో కూడా వ్యాపార మెళుకువలతో పాటు అభిరుచి ఉన్నవారే వస్తారు ….

OTT లు వచ్చాక మన అభిమాన తారలు ఎన్ఠీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో ఆగిపోలేదు.

Lior Raz (Fauda ఫేమ్), Kublai Khan (Marcopolo వెబ్ సిరీస్ నటుడు), ఇంకా అనేక విదేశీ నటులు అభిమాన నటులయ్యారు …. తెలుగు సినిమాల పబ్లిసిటీ మనకి ఎక్కువగా చేరడం వల్ల మన భాషా నటుల సినిమాలని చూస్తున్నాం గానీ నవరస, హిట్ అండ్ రన్ లాంటి సినిమాలు పబ్లిసిటీ ద్వారా మనకి చేరితే వాటిని కూడా చూస్తాం. చూసిన చాలా వాటికి తర్వాత సీజన్ కోసం ఎదురు చూస్తున్నామంటే మన కళాభిరుచి పరిధి విస్తరించింది …. నాణ్యత ఉన్న చలనచిత్రాలు మనకి చేరుతున్నందుకే మన ఛాయిస్ పెరిగింది …. మన తెలుగు నటులు కూడా తమకి పోటీ ఎవరితో ఉందో ఎరుక వస్తుంది.

అందువల్ల ప్రభుత్వమే టికెట్స్ అమ్మితే సినిమా రంగానికి నష్టం లేదు
సత్తి సునీల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap