డిసెంబర్ 6న ‘పానిపట్’ యుద్ధం

భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్ యుద్ధం (14 జనవరి 1761) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్’. స్టార్ డైరెక్టర్ అశు తోష్ గోవర్కర్ దర్శకత్వంలో సునీత గోవర్కర్, రోహిత్ షెలాత్కర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్ పార్వతీబాయిగా, మరియు సంజయ్ దత్ ఆహ్మద్ అబు’లీగా నటిస్తున్నారు. పుర దాస్ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరించబడి ఇటీవల విడుదల చేసిన ‘మర్డ్ మరాఠా’ సాంగ్ కి దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, రీరికార్డింగ్, ఆర్ట్ వర్క్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూతో రూపొందిన ఈ హిస్టారికల్ విజువల్ వండర్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మన్ మే శివ’ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అర్జున్ కపూర్, కృతి సనన్, ఇతర ముఖ్య నటులు నటించిన ఈ పాట చరిత్రలో ముఖ్యమైన సంఘటనలైన ఎర్ర కోట పై మరాఠా విజయం సాధించడం, సదాశివరావు భావ్ నాయకత్వంలో ఎర్ర కోట వద్ద మొదటిసారి మరాఠా జెండాను ఎగురవేసిన సందర్భంగా వస్తుంది. మరాఠా వీరుల ధీరత్వాన్ని, ఐకమత్యాన్ని ప్రతిబింబించే ఈ పాటకు అజయ్-అతుల్ సంగీత సారథ్యం వహించగా జావేద్ అక్తర్ రచించారు. ప్రముఖ సింగర్స్ కునాల్ గంజవల్ల, దీపావై నగర్ మరియు పద్మనాబ్ గయక్వాడ్ త్రయం అద్భుతమైన స్వరంతో ఆలపించారు.

సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతిసనన్, పద్మిని కొల్హాపురి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: సి.కె.మురళీధరన్, ఎడిటింగ్: స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ చంద్రకాంత్ దేశాయ్, యాక్షన్: అబ్బాస్ అలీ మొఘల్, బ్యానర్స్: అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, విజన్ వరల్డ్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్: సునీతా గోవారికర్, రోహిత్ షెలాత్కర్. దర్శకత్వం: అశుతోష్ గోవారికర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap