గురుపూజోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ను ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ జర్నలిస్ట్స్ సంఘ) నేతలు ఘనంగా సత్కరించి, పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఈమేరకు ఆయన స్వగృహంలో సంఘ నాయకులు బడే ప్రభాకర్, తాడి రంగారావు, జూనూతుల శివరామ్, ఆవాలు దుర్గా ప్రసాద్, సామర్ల మల్లికార్జున రావు, టీవీ రంగారావు, వెంకటేశ్వరరావు తదితరులు ఆయనను శాలువాతో, పూలమాలలతో, పుష్పగుచ్చాలతో సన్మానించి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈసందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్ట్ గా, పత్రికా సంపాదకులు గా, మీడియా రంగంలో విశేష సేవలందించిన ఆయన పాత్రికేయ విలువలను పతాక స్థాయిలో నిలిపిన ఘనత తుర్లపాటిదన్నారు. పాత్రికేయుడిగా పద్మశ్రీ అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి కుటుంబరావు గారన్నారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, ప్రకాశం పంతులు వంటి మహానుభావులను ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆయనదని పలువు జర్నలిస్ట్స్ ఆయన సేవలను కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తి నుంచి గురుపూజోత్సవం నాడు ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
good tradition.