అక్టోబర్ 2 న బాలలకు, యువకులకు రాష్ట్ర స్థాయి చిత్రకళాపోటీ
రాజమండ్రి, కందుకూరి వీరేశలింగం పురందిరం (టౌన్ హాల్)లో
అక్టోబర్ 2 వ తేదీన ప్రఖ్యాత చిత్రకారులు ఆచార్య మాదేటి రాజాజీ జయంతి మరియు కళాబంధు కీర్తిశేషులు మద్దూరి శివానంద్ కుమార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులకు మరియు యువతీ యువకులకు రాష్ట్ర స్థాయి చిత్రకళా పోటీలు రాజమండ్రి చిత్రకళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించబడును.ఈ పోటీ అక్టోబర్ 2 వ తేదీ ఆదివారం స్థానిక శ్రీ కందుకూరి వీరేశలింగం పురందిరం (టౌన్ హాల్) ఉదయం 10 గంటలకు నిర్వహించబడును.
చిత్రించవలసిన అంశం:
- సబ్ జూనియర్స్ (4, 5, 6, 7 తరగతులు) – ప్రకృతి దృశ్యం
- జూనియర్స్ (8, 9, 10 తరగతులు) – గ్రామ వాతావరణం
- సీనియర్స్ (కళాశాల విద్యార్థులు) –ఏదైనా అంశంపై సృజనాత్మక చిత్రాలు చిత్రించాలి.
ఈ పోటీలో పాల్గొనే వారికి ఎంట్రీ ఫీజు లేదు. కాపీ చిత్రాలు పోటీకి అనుమతించబడవు.
చిత్రాన్ని చిత్రించడానికి డ్రాయింగ్ షీట్ అందించబడును. మిగిలిన రంగులు బ్రష్లు ఎవరికి వారు తెచ్చుకోవలెను. పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరికొందరికి ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రములు అందించబడును. బహుమతి ప్రదానం అక్టోబర్ 5 వ తేదీన స్థానిక దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో ఉదయం 10 గం.లకు జరుగు నివాళి కార్యక్రమములో జరుగునని, ఇతర వివరాల కొరకు కార్యక్రమ కన్వీనర్ మాదేటి రవిప్రకాష్ గారిని 93933 89458 ఫోన్ నంబర్ కు సంప్రదించ వలసిందిగా రాజమండ్రి చిత్రకళానికేతన్ అధ్యక్షులు మద్దూరి శివ సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలియపరిచారు.
