మహిళల అభ్యుదయాన్ని కోరుకునే సంస్థలు, వేదికలు, మహిళా సంఘాలు, లైన్స్ క్లబ్ లు, రోటరీ క్లబ్ లు, మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు, రచయితలు, కవులు, కళాకారులు, వ్యక్తులు ఈ చిత్రలేఖనం పోటీలలో ఎక్కువమంది పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీ మద్దతు, సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిబంధనలు : ఆ3 షీట్ సైజు తగ్గకుండా ఎటువంటి మీడియంలో అయినా చిత్రాలు గీయవచ్చు.
- ఎంపిక చేయబడిన చిత్రాల ఒరిజినల్స్ పంపాలి.
- పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ఇవ్వబడును.
- వాట్సాప్ ద్వారా పంపేవారు డాక్యుమెంట్ ఫార్మేట్ లోనే పంపాలి.
స్త్రీలు వివిధ రంగాలలో ఎదుర్కొంటున్న వివక్షలను ప్రతిబింబిస్తూ మాత్రమే చిత్రాలు గీయాలి.
సాధికారత సాధనలో మహిళల సమస్యలు, భ్రూణ హత్యలు, వరకట్నం, భర్త, అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు, మద్యం తాగటం, భార్యను కొట్టటం, మానభంగాలు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా వేధింపులు. విద్యా, వైద్యం, ఆహారంలో తేడాలు, బాల్య వివాహాలు, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వివక్షతలు. మూఢ విశ్వాసాలు. స్త్రీ శరీరాన్ని యాడ్స్ లో చూపడం, టీవీ సీరియల్స్ లో స్త్రీ విలన్ పాత్రలు, స్త్రీ పేరుతో బూతులు, కులం పేరుతో పెళ్లి నిరాకరించటం, సానిటరీ నాప్కిన్స్ పై GST, మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో పురుషుల పెత్తనం, అన్ని రంగాలలో సమాన హక్కుల నిరాకరణ.