పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

ఈ రోజు 19-9-21 న కృష్ణా జిల్లా పామర్రులో ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న 11 మంది కళాకారులకు 1116/- నగదు బహుకరించి సంస్థ డైరెక్టర్ చాగంటిపాటి అజయ్ కుమార్ వదాన్యతతో సత్కరించారు.

ఈ మహత్తర ఆదర్శ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, బహు గ్రంథకర్త అయిన మన్నే శ్రీనివాసరావుగారిని సత్కరించారు.
ఈ కార్యక్రమ సూత్రధారి, సంస్థ అధ్యక్షులు ఎన్టీఆర్ (నూతలపాటి త్రివిక్రమరావు), ఉపాధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి వెంకట రత్నం, సంస్థ ప్రతినిధులు పొడుగు ప్రభాకర్, చిన్నం ఆది – నారాయణ, కొలుసు నాంచారయ్య, సోమవరపు రామారావు ప్రభృతులు పాల్గొన్నారు.
కార్యక్రమం ఆసాంతం క్రమశిక్షణతో నిర్వహించి సత్కారగ్రహీతలను వేదప్రవచనాలతో ఆశీర్వదించారు.
-కళాసాగర్

Felicitation to Manne Srinivasarao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap