పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ

నటదర్శకునిగా, రచయితగా, శ్రీ ప్రభాకర నాట్యమండలి సమాజ వ్యవస్థాపకునిగా 60 ఏండ్ల అవిరామ, అవిశ్రాంత బహుముఖీన కృషి చేసి, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞాశాలి పామర్తి సుబ్బారావు.
ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచిన పామర్తి వారి జీవితయానాన్ని చిత్రించుతూ నేను రచించిన “నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు” గ్రంధావిష్కరణ 19.12.2021 న గుడివాడ కైకాల కళామందిర ప్రాంగణంలో వైభవంగా గుడివాడలోని 11 సాహిత్య కళా సంస్థలు సమష్టిగా శత జయంతి కమిటి నిర్వహించడం అరుదైన ఆదర్శ విశేషం.
గ్రంథాన్ని రంగస్థల బహుముఖ ప్రజ్ఞామూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్ రంగస్ధల పురస్కారం, హంస అవార్డుల గ్రహీతయగు KST శాయిగారు ఆవిష్కరించగా, కళారత్న డాక్టర్ జి.వి.ప్రసాదరావుగారు అంకితమందుకున్నారు.

గ్రంథ విశ్లేషణను ఆకాశవాణి కళాకారులు మాడుగుల రామకృష్ణ చాలా చక్కగా చేశారు.
ప్రాచార్యులు, రచయిత్రి పామర్తి లీలాఅజేయ్ నేటి నాటకరంగ స్థితిగతులు, పామర్తివారి ప్రతిభాపాటవాల గురించి ఆలోచణాత్మక ప్రసంగం చేశారు.
విశ్రాంత ప్రాచార్యులు ఆంజనేయులు గారు సభా అధ్యక్షునిగా చేసిన చమత్కార భరిత విజ్ఞానదాయాక ప్రసంగము అలరించింది.

Felicitation to writer Manne Srinivasarao

సీనియర్ నటీమణి అమ్ముల పార్వతి జ్యోతిప్రజ్వలన చేయగా…నటులు, మధుర వక్త, ఉపాధ్యాయులు ఆర్వీయల్ నరసింహరావు వందన సమర్పణ చేశారు.
విఖ్యాత కవి, వక్త వంగా శ్రీనివాస్(వంశీ) అద్భుతమైన సమయజ్ఞత, మధురమైన వాగ్ధాటితో సభను సభను సమన్వయం చేసి అందరి మెప్పు పొందారు.
అమ్ముల పార్వతి, మట్టా రాజా, నరహరిశెట్టి ప్రసాద్, వంగా వంశీ ప్రభృతులు సుల్తానీలో ప్రథమ దృశ్యాన్ని రసరంజకముగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.

మధుర గాయకులు జన్ను బాబూరావు స్వరపరిచి పాడిన హారతి గీతం(వంశీ రచన), నివాళి గీతం (చలసాని శ్రీకృష్ణ రచన) సాహిత్యం, గానం ఒకదానితో ఒకటి పోటీ పడి శ్రోతలను పరవశింప జేశాయి.
ఈ సందర్భంగా కృతి స్వీకర్త సువర్ణ అంగుళీయకము, నూతన వస్త్రాలతో – నిర్వాహకులు నూతన వస్త్రాలతోపాటు విఖ్యాత చిత్రకారులు పందిరి రాంబాబు రచించిన అమూల్యమైన మా కుటుంబచిత్రాన్ని బహుకరించారు – ప్రాచార్యులు, రచయిత్రి లీలవారి భర్త పాత్రికీయులు అజేయ్ దంపతులు నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు.

గుడివాడ పౌరుల పక్షాన పట్టణంలోని 11 సాహిత్యకళారంగ సంస్థలు సంయుక్తంగా పుస్తక రచయిత మన్నే శ్రీనివాసరావుగారికి “వాగ్దేవి పుత్ర” బిరుదు ప్రదానం గావించారు. పామర్తి వారి దౌహిత్రులు మట్టా రాజా ఈ కార్యక్రమానికి వెన్నెముక అయ్యి నిలిచారు.

SA: