నేను చిన్నప్పటినుండి చందమామ అ బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టపడేవాడిని. ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు చందమామ ముఖచిత్రాలు బ్యాక్ కవర్ చూసి అచ్చు గుద్దినట్లు పోస్టర్ కలర్స్ తో వేసేవాడిని. మా బ్రదర్స్ సిస్టర్స్ మరియు మా ఫ్రెండ్స్ బాగుంది.. బాగుంది.. అంటుంటే చాలా ఆనంద పడేవాడిని. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే వపా గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాలి అనే సంకల్పబలంతో మా నాన్నగారిని వెంటబెట్టుకుని మద్రాసు ఇప్పటి చెన్నై వెళ్లి, వడపలని లోని చందమామ బిల్డింగ్స్ లో ఉన్న వపా గారిని కలిసి నా బొమ్మలు చూపించాను. నా బొమ్మలే నాకు చూపిస్తావా? ఎందుకు అని అడగ్గా ఆశ్చర్యమేసింది! అదేంటి సర్, ఇవి నేను గీసినవే అని చెప్పాను. ఎవరికైనా చూపించు ఇవి వపా బొమ్మలంటారా లేక నాగేశ్వరరావు బొమ్మ అంటారా అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. మరి ఎలా సార్ నేర్చుకునేది? అని అడిగా… బజారులో.. బీచ్ లో కూర్చుని వచ్చేవారిని-పోయేవారిని స్కెచ్ పెన్ తో, పెన్సిల్ తో రబ్బరు వాడకుండా గీస్తూ ఉంటే… నీకు నీ స్టైల్ వస్తుంది రా అని చెప్పారు.
మా నాన్నగారి రేమో ఆయన చేర్చుకోలేదు కదా మరి డిగ్రీ అయినా చదువు అని మళ్ళీ మా ఊరు తెనాలి దగ్గర అ పెదరావూరు తీసుకువెళ్లారు. అప్పుడప్పుడు సెలవుల్లో వచ్చి వారిని కలిసి నేను వేసిన బొమ్మలు చూపిస్తూ ఉండేవాడిని. ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పేవారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాగిరెడ్డి చక్రపాణి గారు ఏ ఆర్టిస్ట్ కి ఇవ్వనంత.. స్వేచ్ఛ ఇచ్చారు. నాకు తెలిసి పురాణేతిహాసాల్లో వారికున్న నాలెడ్జ్ అపారం. చందమామ గేట్లు తెరవగానే, ఎడమ పక్కన మెట్లెక్కగానే ఒక సపరేటు రూము లో ఒంటరిగా కూర్చుని పెయింటింగ్స్ గీస్తూ ఉండేవారు. ఆఫీసుకి వారు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నెలకి మాత్రం ఇన్ని బొమ్మలు అని ఇస్తే చాలు వారి జీవితం వారికి ఇచ్చేవారు.
ఒక్కోసారి వపా కలవాలని వెళితే నాలుగైదు రోజుల నుంచి ఆయన రావడం లేదు అనీ వాచ్ మెన్ చెప్పేవాడు. ఆయన ఇష్టం..
ఏది ఏమైనా నేను ఆర్టిస్ట్ గా అవ్వడానికి కారణం మాత్రం వపా గారే… వారికే సదా కృతజ్ఞుణ్ణి. వపా గారితో నాకున్న కొద్దిపాటి పరిచయం మహద్ భాగ్యంగా భావిస్తున్నాను. ఆయన నాకు బహుమతిగా ఇచ్చిన వపా చిత్రం ఇప్పటికీ నా వద్ద భద్రంగా దాచుకున్నాను.
మీ
-కొండూరు నాగేశ్వరరావు, హైదరాబాద్
మీరు అదృష్ట వంతులు. అలాంటి మహాన్నుతులు సాంగత్యం పొందటం
వపా గారితో నా పరిచయం వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. వపా గారి పేరు పలికినా, వారి పెయింటింగ్ చూసినా మధురానుభూతి కలుగుతుంది.
Konduru Nageswar Rao, Hyd
మీ అదృష్టం… కొన్ని జన్మలు ఇలాంటివి జరగడం వల్లనే ధన్యమైపొతాయనుకుంటా…మాకెవ్వరికీ దక్కని అదృష్టం…. మీకు శతకోటి అభినందనలు….మాకందరికీ తెలిపినందుకు కృతజ్ఞతలు