కేంద్రీయ విద్యాలయం లో చిత్రలేఖనం పోటీలు

వత్తిడి నుండి విజయం దిశగా… ‘పరాక్రమ్ దివస్’
విద్యార్థుల్లోని సృజనాత్మకను ప్రోత్సహించడానికి, విద్యామంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 23 జనవరి 2024న వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ప్రేరణతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు, ‘పరాక్రమ్ దివస్’గా పాటించారు. అదే సమయంలో, విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవటానికి చిత్రలేఖనం పోటీలు నిర్వహిచారు.

NTR జిల్లా- నోడల్ సెంటర్ గా ఎంపికైన కేంద్రీయ విద్యాలయం నెం.2 విజయవాడ (వ్యాగన్ వర్కుషాపు, గుంటుపల్లి) పరిసర ప్రాంతాలలో ఉన్న 11 పాఠశాలల నుండి 100 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి విద్యాలయ ప్రిన్సిపాల్ మరియు అతిథులు పూలమాల వేసి నివాలులర్పించారు. అనంతరం కుమారి దామ చైత్ర తన సంప్రదాయ నృత్యంతో అలరించింది.

స్టేట్ బోర్డ్ మరియు CBSE పాఠశాలల నుండి 9, 12వ తరగతి స్థాయి 100 మంది విద్యార్థులు ఈ చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా డా. సత్యప్రసాద్, కళాసాగర్ మరియు శివకుమార్ కే.వి. వ్యవహరించారు.
విద్యాలయ ప్రిన్సిపాల్ Dr. P.V.S.S.S.R. కృష్ణ విజేతలకు బహుమతులు అందజేస్తూ విద్యార్థులు అద్భత ప్రతిభ కనపరచారని, పరీక్షల సమయంలో ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గిస్తాయని, మనోధైర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

పి. తేజస్విని, డి.జె.ఇ. అభిషేక్, డి.స్నేహస్నిగ్థ, పూర్వజ, ఎల్. సత్యసాహితిలను విజేతలుగా ఎంపిక చేసి స్వాతంత్ర్య సమరయోధుల పుస్తకాలు మరియు సర్టిఫికేట్ లను బహుకరించారు. పోటీలో పాల్గొన్న ప్రతివిద్యార్దికీ ప్రధానమంత్రి వ్రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్‌’ పుస్తకం, పెయింటింగ్ మెటీరియల్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లను అందజేసారు.

SA:

View Comments (2)

  • ధన్యవాదాలు సార్... విద్యార్థుల్లోని సృజనాత్మకను ప్రోత్సహించడానికి, విద్యామంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో కళలను ప్రోత్సహిస్తూ చేసిన కార్యక్రమం పరీక్షాపే చర్చా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ప్రేరణతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు, ‘పరాక్రమ్ దివస్’వంటి ఉత్తమమైన కార్యక్రమాలకు కూడా లోకల్ పత్రికల్లో స్థానం కరువవుతున్న సందర్భం. అలాంటిది 64 కళలు.కామ్ అంతర్జాల మ్యాగజైన్ అంతర్జాతీయ ప్రచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.