ఇటీవల విజయవాడలో క్యాలిగ్రఫీ ఆర్ట్ లో వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డు-2021 అందుకున్న పరమేశ్వర రాజు గురించి… ఆయన కళ ప్రత్యేకత గురించి… ఈ అవార్డు అందుకోవడానికి విజయవాడ వచ్చిన రాజుగారిని కలిసి తెలుసుకున్న ఆశక్తికర విషాయాలు మీకోసం….
పూసపాటి పరమేశ్వరరాజుగారి పేరు గత ఆరేళ్ళుగా వింటున్నాను. నా ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన వీరితో గతంలో మాట్లాడుతూ 64కళలు.కాం చదుతున్నారా అని అడిగితే, తెలుగు మాట్లాడగలను కాని చదవలేను ఆన్నారు. క్యాలిగ్రఫీ అంటే అందంగా అక్షరాలు రాయడమే అన్న అలోచనను తుడిసేచే ప్రయత్నం చేశారు తన చిత్రాలతో. క్యాలిగ్రఫీ ఆర్ట్ లో వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డుకు అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిని కలిసి క్యాలిగ్రఫీ ఆర్ట్ గురించి లోతుగా మాట్లాడితే తెలిసింది వీరికి అందులో ఎంత ప్రావీణ్యంవుందో…
ఈ క్యాలిగ్రఫీలో అక్షరాలతో పాటు అందమైన రేఖా చిత్రాలనూ జమిలిగా వేయటం జరుగుతుంది. ఒక్కోసారి అక్షరాలు డిజైన్‌లో మమేకమవుతాయి. ఇది చిత్రకళలో ఒక ప్రత్యేకమైన శాఖగా శోభిల్లుతున్నా, దీనిలో కృషి చేసిన వారు చాలా తక్కువ. వారిలో ఎక్కువ మంది దీనిలోని అక్షర శోభకు మాత్రమే పరిమితమవుతున్నారు.
కళకు సరిహద్దులు చెరిపి వేసి వాటిని మరింత ముందుకు తీసుకొని వెడుతూ, క్యాలిగ్రఫీలోని దేవనాగరి లిపితో చిత్రకళను సంయమనం చేస్తూ తనదైన శైలిని వృద్ధి చేసినవారు పూసపాటి పరమేశ్వరరాజు.
1961లో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో వాండ్రంలో జన్మించిన పూసపాటి పరమేశ్వరరాజు తన బాల్యాన్ని వివిధ భారతీయ నగరాల్లో గడిపారు. ఎందుకంటే రాజుగారి తండ్రి ఆర్మీ అధికారిగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పనిచేశారు. పరమేశ్వరరాజు తన తాతగారైన రాఘవరాజుగారి దగ్గర చిత్రకళలో ఓనమాలు నేర్చుకున్నారు. విద్యార్థి దశలో ప్రతిభావంతుడైన రాజు ఔరంగాబాద్లోని ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఆర్ట్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా విశ్వవిద్యాలయం నుండి వరుసగా అప్లైడ్ ఆర్ట్లో BFA మరియు MFA అందుకున్నాడు. చిత్రకళలో పూర్తి జీవితం ప్రారంభించకపూర్వం ఆయన అడ్వర్టైజింగ్ పరిశ్రమలో కొంతకాలం పనిచేసారు. నాగార్జునా ఫెర్టిలైజర్స్‌లో డిజైన్ డైరెక్టరుగా పనిచేశారు. ప్రస్తుతం పూర్తి సమయం కళాసాధనకు కేటాయించారు. భారతీయ ఇతిహాసాలను ఆధునికంగా చెప్పాలనే ముప్పయ్యేళ్ల ప్రయత్నం ఐకానిక్ క్యాలిగ్రఫీ రూపంలో వ్యక్తమైంది అంటారు రాజు.
భారతీయ ఐకానోగ్రఫీ, ఆధ్యాత్మిక మరియు వేడుకల సంస్కృతిపై వీరి అధ్యయనం మరియు పరిశోధన ఆధారంగా, కనీస సౌందర్యశాస్త్రంలో పనితనం క్యాలిగ్రఫీ ఆర్ట్ సిరీస్ మూలాంశాలలో కనిపిస్తుంది. పవిత్రత మరియు ధ్యానం చుట్టూ ఇతివృత్తంగా, అతని అలంకార వ్రాత సంజ్ఞామానాలు మరియు ఐకానిక్ గ్రాఫిక్స్ సాంప్రదాయ మరియు సమకాలీన భూభాగాలలో ప్రయాణిస్తాయి. వివిధ పరిమాణాల నిబ్స్ మరియు పెన్నులను ఉపయోగించి, ఆధునికతతో రూపొందించిన చిత్రాలు అతని సాధారణ రూపాలు బౌద్ధమతం, సిక్కుమతం, జుడాయిజం, ఇస్లాం పాటు సంఖ్యా నమూనాలు మరియు యంత్రాలతో సహా వివిధ విశ్వాసాలకు సంబంధించిన ఇతిహాసాలు మరియు కథనాలను ఏకవర్ణం లో వివిధ పాళీలు, కలాలతో సజీవంగా చిత్రిస్తారు. రాజు చిత్రించిన బొమ్మలన్నీ ఎరుపు రంగులో వుంటాయి, ఎందుకంటే అరుణ వర్ణం ఆధ్యాత్మికతకు సంకేతమని రాజుగారి అభిప్రాయం. ఈ క్యాలిగ్రఫీ కళాకోవిదుడు బహుభాషా జ్ఞాని కూడా.
రామాయణం: 37 డ్రాయింగ్‌ల సంకలనంగా క్యాలిగ్రఫీలో రామాయణం రూపొందించారు. ఆరు కాండాల ఇతిహాసంలో ఎన్నెన్ని ఘట్టాలు… ఎన్నెన్ని పాత్రలు…. ఎంతటి వైవిధ్యం… వీటన్నిటిని ఎంపిక చేసుకున్న పాళీల ద్వారా లయగతితో వ్యక్తీకరించారు. ఈ పుస్తకంలో రామాయణ కథానుసారం చిత్రాలుండవు. రాజు మనసు కావ్యాసు పై ముద్రపడిన ఘట్టాలను డ్రాయింగులుగా మలచారు.
పురస్కారాలు:
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర పురస్కారం అందుకున్న వీరి చిత్రాలు హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు మరియు బరోడాలలో సోలో మరియు గ్రూప్ షోలలో ప్రదర్శించబడ్డాయి భారతదేశంలోని కొచ్చి, ముజిరిస్ బినాలేలో, బీజింగ్లోని 5వ అంతర్జాతీయ బైనాలేలో మరియు జర్మనీలో కూడా. బెల్జియంలోని మ్యూజియం ఆఫ్ సేక్రేడ్ ఆర్ట్ లో పరమేశ్వర్ రాజుగారు వివిధ అంశాలపై చిత్రాలు వున్నాయి. వీరు భారతదేశంలోని వివిధ కళాశాలలలో ఉపన్యాసాలు, వర్క్ షాప్ లు నిర్వహించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వీరు రూపొందించిన చిత్రాలతో పుస్తకం రూపొందించే పనిలో వున్నారు.
–కళాసాగర్ యల్లపు
Wonderful art