సినీ ప్రస్థానంలో పదనిసలు

‘సినిమా అంటే రంగుల ప్రపంచం ‘ ఈ రంగుల ప్రపం చాన్ని క్రియేట్ చేసేది 24 శాఖలకు చెందినవారు. ఇన్ని శాఖలవారు ఓ కుటుంబంలా కష్టి స్తేనే ఓ సినిమా రూపొందుతుంది. అలాంటి ఓ సిని మాను ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి వారధిలా వ్యవహరిం చేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టుల్లో ఎన్నదగ్గవారు కొందరే. సినిమా రంగంలోని జర్నలిస్టులకు ఇంత ప్రాముఖ్యతను తెచ్చి పెట్టిన జర్నలిస్టులేందరో…వారిలో పసుపులేటి రామారావు ఒకరు. 46ఏళ్లు జర్నలిస్ట్ గా ఆయన తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. తన అనుభవాలను క్రోడీకరించి ఆయన రాసిన పుస్తకమే ’46 ఏళ్ల సినీ ప్రస్థానంలో పదనిసలు’. ఈ పుస్తకాన్ని ఆయన మెగాస్టార్ చిరంజీవికి అంకితమిచ్చారు. ఉండ్రాజవరంలో నాటకాలు వేస్తూ కమ్యూనిస్ట్ భావాలున్న యువకుడిగా ఉన్న పసుపులేటి రామారావు కొన్ని పుస్తకాలు చదివి కమ్యూజిజం భావాజాలాలు ఇనుమడింప చేసుకున్న క్రమంలో కుటుంబ పరిస్థితులు ఆయన్ని మద్రాసు వైపు అడుగులేయించాయి. ముందుగా సినిమా రంగంలో ఏదో ఒకటి కావాలనుకున్న ఆయన అనుకోకుండా విశాలాంధ్రతో జర్నలిస్ట్ గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్ గా మారారు. అలనాటి అగ్ర దర్శకులు, నిర్మాతలు, హీరోల నుండి నేటి తరం దర్శకులు, నిర్మాతలు, హీరోలు, ఇతర నటీనటులకు పసుపులేటి రామారావు సుపరిచితులే. సాధారణంగా సినీ జర్నలిస్టులు ఇతరుల పుస్తకాలను రాస్తుంటారు. కానీ రామారావు సినీ జర్నలిస్ట్ తన ప్రయాణం ఎలా ప్రారంభమైంది.. అసలు ఆయన సినీ జర్నలిస్టుగా మారిన వైనం, అలా మారే క్రమంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు.. జర్నలిస్ట్ గా మారిన తర్వాత ఆయన జీవితంలో ఆయన కలుసుకున్న వ్యక్తులు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు వారితో ఆయన అనుభవాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, శోభన్ బాబుతో ఉన్న బంధం, గురువుగారిగా భావించే దాసరితో ఉన్న సఖ్యత, మురళీమోహన్, టి.కృష్ణలతో పాటు సినీ దిగ్గజాలైన ఎల్.వి.ప్రసాద్, చిత్తూరు నాగయ్య, అల్లు అరవింద్, బాల మురళీకృష్ణ, శ్రీశ్రీ, డి.రామానాయుడు, రాఘవేంద్రరావు, కృష్ణ, విజయనిర్మల దంపతులు, S.రాఘవేంద్రరావు, కె.దేవీవరప్రసాద్, ఆర్.నారాయణ మూర్తి, పరుచూరి బ్రదర్స్ ఇలా ఎందరినో ఆయన స్పెషల్ ఇంటర్వ్యూలు చేశారు. ఈ క్రమంలో మద్రాసుతో ఆయనకున్న అనుబంధాన్ని, మద్రాసు ఎందుకు విడిచి రావాల్సి వచ్చిందనే విషయాలను కూలంకషంగా వివరించారు. జర్నలిజంలో డిజిటల్ మీడియా రాజ్యమేలుతున్న నేటి కాలంలో ఒకప్పటి జర్నలిజం, జర్నలిస్టులు ఎలా ఉండేవారు అనే విషయాలను తెలియజేశారు పసుపులేటి రామారావు. నేటి తరం జర్నలిస్టులకు ’46 ఏళ్ల సినీ ప్రస్థానంలో పదనిసలు’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓ ఇన్స్పిరేషన్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు.

రచన: పసుపులేటి రామారావు ఎడిటర్ అండ్ పబ్లిషర్ పసుపులేటి వెంకటలక్ష్మి 8-2-293/82/24 ఏ జవహర్ కాలనీ, ఇందిరా నగర్, బంజారా హిల్స్ హైదరాబాద్ – 500034
ప్రతులకు: పసుపులేటి ప్రచురణలు నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24652378, మొబైల్: 9392364031

SA: