దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి అందరికీ పరిచయమే. గతంలో కుటుంబ కథా చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “కొత్త బంగారు లోకం”, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం బెడిసి కొట్టింది. వెంకటేష్ తో ‘నారప్ప ‘ పర్వాలేదనిపించింది. అయితే, ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అదే పెద్దకాపు. నారప్ప వంటి రిమేక్ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు పెదకాపు మూవీ తీశారు. ద్వారకా క్రియేషన్స్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది.
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. తొలి పాట ‘చనువుగా చూసిన అనే పాటను విడుదల చేయగా, వినసొంపుగా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకూ పని చేస్తున్నారు. ‘పెదకాపు’లో అన్ని పాటలకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందించారు.
ఇందులో హీరోను రగ్డ్ లుక్ లో.. హీరోయిన్ ను సాఫ్ట్ లుక్ లో బాగా చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో బాగుంది. ఇప్పటికే ఈ ప్రోమో విన్నవారు మిక్కీ జె మేయరే తమ మార్క్ మెలోడీతో బాగానే ఎట్రాక్గ్ చేశారని అంటున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ టీజర్ ని విడుదల చేయగా, అందరి దృష్టి ఆకర్షించింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రసంగంతో ఆ టీజర్ మొదలైంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న గ్రామంలో సాధారణ వ్యక్తి పాలన చేపట్టడం అనేది ఈ సినిమా కథాంశం. రాజకీయ నేపథ్యములో కథ నడుస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది..
Click this link for video song….
https://www.youtube.com/watch?v=sEELaWK8GK4