ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా……
____________________
ఫోటోగ్రాఫర్

స్మైల్ ప్లీజ్ …….
కాస్త నవ్వండి ………
అంటూ
తమ ఏకాగ్రతను
మన ముఖాల మీద నిలిపి
మనల్ని అందంగా చూపించడానికి
వాళ్ళు అపసోపాలు పడుతుంటారు !

ఫోటోలు తీయడమన్నా ….
దృశ్యాలు చిత్రీకరించడమన్నా
అంత సులువేమీ కాదు!
_____________________

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ ! అలాంటి కళలో అద్భుతాలు సాధిస్తున్న ఓ ఫొటోగ్రాఫర్స్ గురించి తెలుసుకుందాం.

పట్టుదలతో కృషిచేసి ఏ రంగంలో నైనా రాణించవచ్చునని, ఫోటోగ్రఫీ లో ఎలాంటి  కొత్త టెక్నాలజీ  వచ్చిన ఫొటోగ్రాఫర్ అవసరం ఎప్పటికీ ఉంటుందని  నిరూపించాడు ఈ హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ ‘పోట్రియా’  వెంకీ….

తెలంగాణ కరీంనగర్లో ఒక అర్చకుని కుటుంబంలో పుట్టిన వెంకీ చదివింది ఇంటర్,  కరీంనగర్లో ఒక సాయిబాబా గుళ్లో అర్చకునిగా తన ప్రస్థానం ప్రారంభించి,  ఫోటోగ్రఫీ పై అభిరుచితో హైదరాబాద్ జె.ఎన్.టి.యూ. ఫోటోగ్రఫీ లో డిగ్రీ గోల్డమెడల్ తో సాధించాడు.  నేడు హైదరాబాద్ లో  ‘పోట్రియా’ వెంకీ అంటే తెలియని వారుండరు. ఫేస్బుక్ లో వెంకీ పేజీకి 13 లక్షల మంది ఫాలోవర్స్ వున్నారంటే మనవాడికి ఎంత పాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు.
బి.ఎం.డబ్ల్యూ. కారులో తిరిగే వెంకీ దగ్గర వంద మంది ఫొటోగ్రాఫర్స్  పనిచేస్తున్నారు.

కేవలం డబ్బు సంపాదించడానికైతే ఫోటోగ్రఫీ ఫీల్డ్ కి రాకండి… ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఫ్యాషన్ తో రండి అంటాడు వెంకీ…

ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ లలో తన స్టూడియో బ్రాంచీలున్నాయి. Sony, Samsung కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నాడు వెంకీ. పెళ్లిళ్లు, వేడుకలకు  ఫొటోలు తీయడానికి విదేశాలు కూడా వెళుతుంటాడు వెంకీ. ఎందరో సినీ స్టార్స్ కు ఫోటోలు తీసిన వెంకీ శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. లాంటి కొన్ని సినిమాలలో కూడా నటించాడు.

ఫోటోగ్రఫీ  రంగంలోకి రావాలనుకునే వారికి  ‘ఫోటోగ్రఫీ ‘ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు వెంకీ…

-కళాసాగర్

SA:

View Comments (2)

  • ఒక కళాకారునిగా మీరు పరిచయం చేసిన మరో కళాకారుడు శ్రీ వెంకీ గారి గురించిన మీ వ్యాసం వివరణాత్మకంగా చాలా బాగుంది.