రవీంద్రభారతిలో మాతృదేవోభవ చిత్రకళా ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రదాన మందిరంలో పికాసో స్కూల్ లో శిక్షణ పొందిన చిన్నారి విద్యార్థులు తమ కళాప్రదర్శన, ప్రతిభను చాటిచెప్పే విధంగా ‘మాతృ దేవోభవ’ శీర్షికన చిత్రకళా ప్రదర్శనను మే 8న ప్రారంభం కానుంది. ప్రదర్శన 11వ తేదీ వరకు ఉదయం 11 నుండి రాత్రి 7గంటలకు వరకు సందర్శకుల దర్శనార్ధం తెరచి ఉంటుందని సంస్థ డైరెక్టర్ బైరు రమేష్ తెలిపారు. ఈ ప్రదర్శన మే 10 వ తేదీ వరకూ మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

ఇందుకు సంబంధించిన పోస్టర్ ని మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణచే ఆవిష్కరింపజేశారు. పోస్టర్ ని ఆవిష్కరించిన డా. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ చిన్నారి చిత్రకారులు తమ అమ్మలకు సమర్పిస్తున్న గొప్ప కానుక ఈ ప్రదర్శన అన్నారు. ఈ చిత్రకళా ప్రదర్శనకు అధిక సంఖ్యలో చిన్నారులు, విద్యార్థులు, చిత్రకళ ఔత్సాహిక ప్రేక్షకులు విచ్చేసి దర్శించి చిన్నారులను ఆశీర్వదించి ప్రోత్సహించాలని రమేష్ కోరారు.

SA: