ఆదర్శకవి మలయశ్రీ

ముత్యబోయిన మలయశ్రీ గారు మంచిర్యాల జిల్లాలో పేరెన్నిక గన్న కవి. మలయశ్రీ గారిని పద్యాగేయ కవిగా తెలియని వారుండరు. వీరు 14.06.1947 న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని “వంగపహాడ్” లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కొమురమ్మ కనకయ్యలు. వీరు తెలుగు పండిత్ శిక్షణ అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తదనంతరం M.A.(Telugu) చదివారు. మిగతా ఉపాధ్యాయులు పట్టణాల్లో చేరి పోతుంటే, మలయశ్రీ గారు పట్టుపట్టి పల్లెల్లో; అదికూడా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ తాలూకాలోని మారుమూల డబ్బా, బోదంపల్లి, సల్గుపల్లి, గొర్రెగుట్ట, బాబసాగర్, తోషం, హస్కాపూర్, యపల్గూడ లాంటి పల్లెటూర్లో తెలుగు మాష్టారుగా పని చేసారు. వారు 1967 లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ 2005 లో పదవీ విరమణ చేశారు.

వీరి రచనలు దివిసీమ దీనగాధ, జాగృతి, చదువు పాటలు, తెలుగు వెలుగులు, తెలంగాణ గెలుపు, అమ్మభాష శతకము, మలయశ్రీ నీతి శతకము, మొగ్గలు, సబల మొదలైనవి. ఇందులో మొగ్గలు బాలసాహిత్యనికి చెందినది కాగా సబల స్త్రీ శక్తిని నిరూపించే పద్యకావ్యం.

మలయశ్రీ గారు కవనమందును, జీవనమునందును నియతిని, వినీతిని అనుసరించారు. సిరిపురసీమ (అడవి పల్లే) అనే కవితా సంపుటిలో మత్తకోకిల, తరలము, మధ్యక్కర పద్యములతో పల్లే అందాలను చక్కగా వివరించినారు.

ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో “ఆదర్శ గురువు” లో
సీ: ఓర్పుతో నేర్పుతో నొనరంగా శ్రద్ధతో
మనసార బోధించు మానవుండు
అర్థము గానట్టి అడిగిన శిష్యుల
కర్థము పలుమార్లు గరపువాడు
బోధించు లౌకిక బుద్ధి జ్ఞానంబులు
నాటల నాసక్తి నాదరించు
దేశభక్తి కథలు తీరైన గేయాలు
నాటికల్ నేర్పించు నటుడతండు

అని పై విధంగా చెప్పారు.

బాల కార్మిక వ్యవస్థ పై తిరుగుబాటు చేస్తూ సమరాశంఖమూది “బాలలుండెడి చోటుదే పాఠశాల, బడికి బంపుమన్న బాగుపడగా” అంటు బాల కూలీల బానిస సంకెళ్లను తెంచే ప్రయత్నం చేయడం కడు రమణీయము.

తన పద్యాల్లో, కవితల్లో సమాజంలోని అసమానతల మీద, స్త్రీల అభ్యుదయము కొరకు, వయోజన విద్య, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, దేశభక్తిని తెలిపే గీతాలు, కథలు, నాటికలు వ్రాసారు. బడి పిల్లలతో మద్యం మానాలని, ప్రకృతి పైన జంతుజాలం పైన ప్రేమ చూపాలని, నైతిక విలువలు పాటిస్తూ దేశ సౌాగ్యానికి పాటుపడాలని తన నాటికల ద్వారా ప్రబోధించే వారు.

స్కౌట్ మాష్టారుగా బడి పిల్లల్లో క్రమశిక్షణ పెంచే వారు. తన పాటలతో, గేయాలతో వయోజన విద్యావ్యాప్తికి పూనుకున్నారు. యోగ నేర్పిస్తూ ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను వివరించారు. 1971 మరియు 2002 సంవత్సరాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు.

వనవాసీ కళ్యాణ పరిషత్, లీడ్ ఇండియా, ఏకలవ్య ఫౌండేషన్, తెలుగు భాషా సంరక్షణ సమితిలో పనిచేసారు. మంచిర్యాల సాహితి సంరక్షణ సమితికి చాలా సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. అక్షర జ్ఞానం, తాళపత్ర గ్రంథాల సేకరణ, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. దాశరథి రంగాచార్య, వానమామలై వరదాచార్యులు, సదాశివ మాష్టారు వంటి లబ్ధప్రతిష్టుల మన్ననలు అందుకున్నారు.

మలయశ్రీ గారు సుమారు 35 గ్రంథాలు వ్రాసారు. అందులో మహాపురుషులు, శ్మశానం (పద్య కావ్యం), అలోచనాలోచనలు(వ్యాసాలు), దేశభక్తి పారిజాతాలు, ఒగ్గుకథలు, బుర్ర కథలు, ఏకపాత్రాలు, నేను-సమాజం (స్వీయ చరిత్ర) అముద్రితాలు.

1986 లో తన P.R.C. ఏరియర్స్ డబ్బులు సమయానికి ఇవ్వక పోవడం వలన, ఉన్నతాధికారులకు తన సమస్యను పద్యాల్లో తెలియజేయడం జరిగింది.

కం. ఆర్యా! నమస్కరించే
కార్యార్థిని, సిరిపురమునగల తెలుగొజ్జన్
పర్యాప్తంబుగా వ్రాసేద
కార్యాలయమున సమస్య కదలకనుండెన్
బిల్లు బిట్టుగ గంపించే బల్లక్రింద

పదవీ విరమణ అనంతరం కూడా రచనలు చేస్తూ, మొక్కలు పెంచుతూ, భాషా మరియు సాహితి సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎనిమిది పదుల వయస్సులో కూడా సాహితి సేవ చేస్తూ, యువ కవులకు మార్గ నిర్దేశం చేస్తూ… కళలు సమాజ అభ్యున్నతి కొరకే అని గట్టిగా నమ్మే ఆదర్శకవి మలయశ్రీ.
………………………………………………………………………….
శ్రీ ముత్యబోయిన మలయశ్రీ గారు మంచిర్యాల జిల్లాలో పేరెన్నిక గన్న కవి. మలయశ్రీ గారిని పద్యాగేయ కవిగా తెలియని వారుండరు. వీరు 14.06.1947 న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని “వంగపహాడ్” లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కొమురమ్మ కనకయ్యలు. వీరు తెలుగు పండిత్ శిక్షణ అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తదనంతరం M.A.(Telugu) చదివారు. మిగతా ఉపాధ్యాయులు పట్టణాల్లో చేరి పోతుంటే, మలయశ్రీ గారు పట్టుపట్టి పల్లెల్లో; అదికూడా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ తాలూకాలోని మారుమూల డబ్బా, బోదంపల్లి, సల్గుపల్లి, గొర్రెగుట్ట, బాబసాగర్, తోషం, హస్కాపూర్, యపల్గూడ లాంటి పల్లెటూర్లో తెలుగు మాష్టారుగా పని చేసారు. వారు 1967 లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ 2005 లో పదవీ విరమణ చేశారు.

వీరి రచనలు దివిసీమ దీనగాధ, జాగృతి, చదువు పాటలు, తెలుగు వెలుగులు, తెలంగాణ గెలుపు, అమ్మభాష శతకము, మలయశ్రీ నీతి శతకము, మొగ్గలు, సబల మొదలైనవి. ఇందులో మొగ్గలు బాలసాహిత్యనికి చెందినది కాగా సబల స్త్రీ శక్తిని నిరూపించే పద్యకావ్యం.

మలయశ్రీ గారు కవనమందును, జీవనమునందును నియతిని, వినీతిని అనుసరించారు. సిరిపురసీమ (అడవి పల్లే) అనే కవితా సంపుటిలో మత్తకోకిల, తరలము, మధ్యక్కర పద్యములతో పల్లే అందాలను చక్కగా వివరించినారు.

ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో “ఆదర్శ గురువు” లో
సీ: ఓర్పుతో నేర్పుతో నొనరంగా శ్రద్ధతో
మనసార బోధించు మానవుండు
అర్థము గానట్టి అడిగిన శిష్యుల
కర్థము పలుమార్లు గరపువాడు
బోధించు లౌకిక బుద్ధి జ్ఞానంబులు
నాటల నాసక్తి నాదరించు
దేశభక్తి కథలు తీరైన గేయాలు
నాటికల్ నేర్పించు నటుడతండు

అని పై విధంగా చెప్పారు.

బాల కార్మిక వ్యవస్థ పై తిరుగుబాటు చేస్తూ సమరాశంఖమూది “బాలలుండెడి చోటుదే పాఠశాల, బడికి బంపుమన్న బాగుపడగా” అంటు బాల కూలీల బానిస సంకెళ్లను తెంచే ప్రయత్నం చేయడం కడు రమణీయము.

తన పద్యాల్లో, కవితల్లో సమాజంలోని అసమానతల మీద, స్త్రీల అభ్యుదయము కొరకు, వయోజన విద్య, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, దేశభక్తిని తెలిపే గీతాలు, కథలు, నాటికలు వ్రాసారు. బడి పిల్లలతో మద్యం మానాలని, ప్రకృతి పైన జంతుజాలం పైన ప్రేమ చూపాలని, నైతిక విలువలు పాటిస్తూ దేశ సౌాగ్యానికి పాటుపడాలని తన నాటికల ద్వారా ప్రబోధించే వారు.

స్కౌట్ మాష్టారుగా బడి పిల్లల్లో క్రమశిక్షణ పెంచే వారు. తన పాటలతో, గేయాలతో వయోజన విద్యావ్యాప్తికి పూనుకున్నారు. యోగ నేర్పిస్తూ ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను వివరించారు. 1971 మరియు 2002 సంవత్సరాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు.

వనవాసీ కళ్యాణ పరిషత్, లీడ్ ఇండియా, ఏకలవ్య ఫౌండేషన్, తెలుగు భాషా సంరక్షణ సమితి లో పని చేసారు. మంచిర్యాల సాహితి సంరక్షణ సమితికి చాలా సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు.

అక్షర జ్ఞానం, తాళపత్ర గ్రంథాల సేకరణ, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.

దాశరథి రంగాచార్య, వానమామలై వరదాచార్యులు, సదాశివ మాష్టారు వంటి లబ్ధప్రతిష్టుల మన్ననలు అందుకున్నారు. మలయశ్రీ గారు సుమారు 35 గ్రంథాలు వ్రాసారు. అందులో మహాపురుషులు, శ్మశానం (పద్య కావ్యం), అలోచనాలోచనలు(వ్యాసాలు), దేశభక్తి పారిజాతాలు, ఒగ్గుకథలు, బుర్ర కథలు, ఏకపాత్రాలు, నేను-సమాజం (స్వీయ చరిత్ర) అముద్రితాలు.

1986 లో తన P.R.C. ఏరియర్స్ డబ్బులు సమయానికి ఇవ్వక పోవడం వలన, ఉన్నతాధికారులకు తన సమస్యను పద్యాల్లో తెలియజేయడం జరిగింది.

కం. ఆర్యా! నమస్కరించే
కార్యార్థిని, సిరిపురమునగల తెలుగొజ్జన్
పర్యాప్తంబుగా వ్రాసేద
కార్యాలయమున సమస్య కదలకనుండెన్
బిల్లు బిట్టుగ గంపించే బల్లక్రింద

పదవీ విరమణ అనంతరం కూడా రచనలు చేస్తూ, మొక్కలు పెంచుతూ, భాషా మరియు సాహితి సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎనిమిది పదుల వయస్సులో కూడా సాహితి సేవ చేస్తూ, యువ కవులకు మార్గ నిర్దేశం చేస్తూ… కళలు సమాజ అభ్యున్నతి కొరకే అని గట్టిగా నమ్మే మలయాశ్రీ గారు ఎన్నో అవార్డులు అందుకున్నారు, సన్మానాలు పొందారు.

-సుధాకర్ (9963105066)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap