కవి, రచయిత గుండాన జోగారావు షష్టిపూర్తి సందర్భంగా ‘రమ్యభారతి’ పత్రిక ఆధ్వర్యంలో ‘లఘు కవితల’ పోటీలు నిర్వహిస్తున్నది.
మినీ కవిత, హైకూ, నానీలు, రెక్కలు, నానోలు, వ్యంజకాలువంటి లఘురూపాలలో కవులు తమ రచనలు పంపవచ్చు. ఒక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చుగాని, ప్రత్యేకంగా పోస్ట్ కార్డు మీద రాసి పోస్ట్ లో మాత్రమే పంపాలి.
బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి: రూ. 600/
ద్వితీయ బహుమతి: రూ. 500/
తృతీయ బహుమతి: రూ. 400/
చతుర్ధ బహుమతి: రూ. 300/
పంచమ బహుమతి: రూ. 200/
గెలుపొందిన రచనలు రమ్యభారతిలో ప్రచురించడం జరుగుతుంది.
కవులు తమ లఘు కవితలను ఫిబ్రవరి 28లోగా
‘రమ్యభారతి’, పి.బి.నెం. 5, విజయవాడ-520001 చిరునామాకు పంపాలి.