ఈనాడులో “పాప” కార్టూన్లు సూపర్ హిట్

“పాప” పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు శివరామరెడ్డి కొయ్య. పుట్టింది ఆగస్ట్ 14 న 1944 సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో. ఫోర్త్ ఫ్హారం చదివేటప్పుడు ఓ సిగరెట్ కంపెనీ వారి కేలండర్లో నటి బొమ్మను పెన్సిల్తో గీశారు తొలిసారిగా. అది గమనించిన వీరి తండ్రి ఆర్ట్ మెటీరియల్ కొనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ఫైనల్ చదివేటప్పుడే ఆంధ్రపత్రిక వారపత్రికలో మొదటికార్టూన్ అచ్చయ్యింది. ప్రారంభంలో ఆంధ్రపత్రిక వీక్లీ, జోకర్, వసుధ తదితర మాసపత్రిక కార్టూన్లు, ఇలస్త్రేషన్లు గీసేవారు.

కాలేజీ పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గా కొంత కాలం పనిచేసి, మధ్యలో కర్ణాటక లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసారు. తర్వాత హైదరాబాద్ ఎన్.జి.ఆర్.ఐ.లో ఆర్టిస్టుగా పనిచేశారు. 1973లో బాపు-రమణల సంపూర్ణ రామాయణం పుస్తక ఆవిష్కరణ సమయంలో కలిసినప్పుడు ‘మీరు కార్టూనిస్టుగా స్థిరపడితే మంచి భవిష్యత్ వుంటుందని’ బాపు గారు సలహా ఇచ్చారట. 1972 లో ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం ప్రచురించిన ‘బిల్దింగ్ రెగులేషన్స్ ఫర్ హేపీ అండ్ హెల్దీ లివింగ్’ అనే పుస్తకానికి కార్టూన్లు గీశారు పాప. 1975లో ఈనాడులో పొలిటికల్ కార్టూనిస్టుగా చేరారు. ఈనాడు అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక అవుతున్న రోజులవి. ముఖ్యమంత్రి అంజయ్య మీదా, ఆయన జోకులమీదా, యాదగిరి మీదా పాప కార్టూన్లు సూపర్ హిట్లు కొట్టేవి. పాప అనగానే బొమ్మ హెలికాప్టర్ వెంటేసుకున్న అంజయ్యగారు అందరికీ గుర్తిస్తారు. ఎనిమిదేళ్లు ఈనాడులో పనిచేశాక 1982లో ఆయన ఫ్రీలాన్సర్ అయ్యారు. ఆంధ్రభూమి, సమయం, ఆంధ్రప్రభ పత్రికల్లో కార్టూన్లు గీశారు. మధ్యలో ఈ వారం వారపత్రిక నడిపారు. పాపా తన చిత్రాలతో హైదరాబాద్, విజయవాడలలో వన్మేన్ షోలు, గ్రూప్ షోలు నిర్వహించారు.

Paapa cartoon

2000 సం. లో కార్టూన్ వాచ్ పత్రిక వారు వీరి కార్టూన్లను లండన్ నెహ్రు సెంటర్ లో ప్రదర్శించారు.
2002 సంవత్సరం హైదరాబాద్ లో ఏ.పి. ప్రెస్ అకాడెమి, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆధ్వర్యంలో బాపుగారి చేతులమీదుగా సత్కారం అందుకున్నారు.

ఫోటోగ్రఫీ లోను ఎన్నోప్రయోగాలు చేసిన వీర్ని నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం. హైదరాబాద్ లో నివాసముంటున్న వీరు త్వరలో వీరి చిత్రాలతో అమెరికా లో ప్రదర్శన చేయాలన్న ఆలోచనతో వున్నారు.

కంప్యూటర్ లో వివిధ డెజైనింగ్ సాఫ్ట్వేర్ లలో కూడా వీరికి ప్రవేశం వుంది. ఇప్పుడొస్తున్న యువతరం సరైన కృషి చేయకుండానే గుర్తింపు కోసం, పేరు కోసం ఆరాటపడుతున్నారని ఇది సరి కాదని అభిప్రాయపడారు.
– కళాసాగర్

Paapa cartoon in Eenadu
Paapa cartoon

Paapa bold cartoon
PaaPa cartoon
Papa silent cartoon

9 thoughts on “ఈనాడులో “పాప” కార్టూన్లు సూపర్ హిట్

 1. పాప కార్టూన్లు వెల్లువెత్తుతున్న రోజుల్లో నన్ను మిత్రులు పాప అని పిలిచేవారు. నేను పాపచ్చీ అని పిలిచేవాణ్ణి. ఆ పేర్లు అలా ఎందుకు సెట్టయ్యాయో గుర్తులేదు. కాని నా నిక్ నేమ్ పాప రోజూ పత్రికల లో కనపడటం గర్వంగా ఉండేది.
  ఇన్నేళ్ళకు పాప గారి గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది .

 2. పాప గారి అంజయ్య,యాదగిరి ఇప్పటికీ అందరికీ నవ్వులు తెప్పిస్తుంటాయి. పాప గారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా వుంది.

 3. Dear kSR garu,
  I felt glad on reading your achievements.you always used to tell me that you are planning for an exhibition of your art works. Now you are going to have in USA. It is a very good news. తాత వయసులో మీరు పాప గా అందరిచే గుర్తించ బడటం బావుంది. I think we have a common friend whom I could identify in the comments send by others about you. He is Achanta Subrahmanyam. If he is the same then I knew him from 1990, he is a SAP specialist and settled in Newark. I was the Regional manager of KONE at that time. . There may be many more who will come out during your Exhibitions. Wishing you all the best and hope your Grand children will enjoy your art works more than you and they will be proud of themselves as your Grand children.

 4. పాత తరం కార్టూనిస్ట్ *పాప* పరిచయం ఆనందదాయకం….*ధన్యవాదములు*

 5. పాత తరం కార్టూనిస్ట్ *పాప* పరిచయం ఆనందదాయకం….*ధన్యవాదములు*
  👍👍👍

 6. ప్రజల్లో కార్టూన్ కు ఎంతో గుర్తింపు తెచ్చిన *papa * గారి జీవితం స్ఫూర్తి దాయకం. వారికి నివాళి. ఆనాటి పత్రికా రంగం కూడా కార్టూన్ కు ప్రాముఖ్యత నిచ్చి పోషించేవి. అలాంటి రోజులు మరలా రావాలని ఆశ!–Bomman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap