స్వర్ణోత్సవ కార్టూనిస్ట్ – టీవీ

టి.వెంకట్రావు చిత్రకారుడు, రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు రచయిత. ఈయన కుంచె పేరు టీవీ. పూర్తి పేరు తిప్పాని వెంకట్రావు. 1944లో ఏలూరులో జన్మించారు. బి.ఏ వరకు చదువుకున్నారు చిత్రకళను స్వయంగా నేర్చుకున్నారు.

1961 నుండి 2013 వరకు విశాలాంధ్ర దినపత్రికకు రాజకీయ కార్టూనిస్టుగా పనిచేసారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేసిన రికార్డ్ వీరిది. 1971 నుండి చిత్రాలు వేయడం మొదలు పెట్టారు.
1979లో విజయవాడలో చిత్రకళా శిక్షణ కేంద్రం స్థాపించారు. 1980లో పోస్టు ద్వారా చిత్రకళను నేర్పే చిత్రసూత కరెస్పాండెన్, కోర్సుల కేంద్రాన్ని ప్రారంభించారు. 1982లో అకాడమీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ స్థాపించారు. అనేకమంది యువ చిత్రకారుల్ని ప్రోత్సహించారు.

Tee Vee cartoon

2007లో విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ వారి స్వాతంత్ర్య సమరం దృశ్య సదనంలో ప్రదర్శించడానికి 50 పెద్ద పెద్ద కాన్వాసులపై తైలవర్ణ చిత్రాలు చిత్రించారు.

టీవీగారు తన పేయింటింగ్లను మాస్కో న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కన్యాకుమారి, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడలలో ప్రదర్శించారు. 1981లో విజయవాడ మునిసిపల్ కార్పోరేషను వారి ‘లోగో’ పోటీలో విజయం సాధించారు.
1983లో వెల్లటూరు చిత్రకళానికేతన్ వారి ప్రాంతీయ ప్రౌఢ చిత్రకారుల పోటీలో గోల్డ్ మెడల్ పొందారు.

2002-03 లలో ఐక్యరాజ్య సమితి వారు నిర్వహించిన అంతర్జాతీయ రాజకీయ కార్టూన్ల పోటీలో “ఆనరబుల్ మెన్షన్ అవార్డు”ను పొందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన బెస్టు కార్టూనిస్టు అవార్డు (లక్షరూపాయల బహుమతి) మొట్టమొదటి అవార్డును 2004లో అందుకున్నారు.

బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ సంస్థవారు 2009లో టీ.వీ.ని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.
కాట్రగడ్డ గంగయ్య గారి స్మారక స్వర్ణ పతకాన్ని 2000 సం.లో, పులుపుల శివయ్య గారి సాహితీ పురస్కారాన్ని 2007 సం.లో మండలి వెంకటకృష్ణారావు గారి పురస్కారాన్ని 2010 సం.లో భగీరధి గారి అవార్డును 2011 సం.లోనూ అందుకున్నారు.
2015 సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం అందుకున్నారు
కార్టూన్లు నేర్చుకోండి, చిత్రకళ చరిత్ర వంటి పలు పుస్తకాలు ప్రచురించారు.

Visalaandra cartoonist T Venkatarao

2 thoughts on “స్వర్ణోత్సవ కార్టూనిస్ట్ – టీవీ

  1. I love Teevee garu. He is my Guru.. His book “How to draw cartoons” created so many cartoonists.. I am one of them. Really I thank our Guruvu garu.. Thank you Kalasagar garu for bringing out his history in a nutshell..

  2. మీది సుదీర్ఘ ప్రయాణం. ఒకే పత్రికలో అంత కాలం పనిచేయటం గొప్ప విషయం. మీ చిత్రాలు,కార్టూన్లూ సింప్లీ సుపర్బ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap