ప్రథమ పోలిగ్లాట్ కాన్ఫరెన్స్ కు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు మహాసభలు మనం చూసాం. అంతర్జాతీయ పోలీగ్లాట్ కాన్ఫరెన్స్ లు చూశామా? కనీసం విన్నామా?
ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి నేటిదాకా పోలిగ్లాట్ కాన్ఫరెన్స్ లు జరిగిన దాఖలాలు లేవు. తెలంగాణ, తమిళనాడులో కూడా అంతర్జాతీయ భాషల సదస్సులు జరగలేదని వినికిడి ఆంధ్ర రాజధాని అమరావతిలో త్వరలో అంతర్జాతీయ పోలిగ్లాట్ కాన్ఫరెన్స్ ఏర్పాటుకు కృషిచేస్తున్న బహుభాషి వెంకట్ పూలబాల.

ఒక దశాబ్ద కాలంగా పూలబాల సుమారు ఒక 100 స్కూల్స్ సందర్శించి అనేకమంది విద్యార్థులకు ఉచితంగా పోలీగ్లాట్ శిక్షణ ఇచ్చేనన్న సంగతి మనం చూస్తున్నాం.
ఒక అడుగు ముందుకు వేసి ఏప్రిల్ 21 వ తేదీన దూరదర్శన్ లో తనచే శిక్షణ పొందిన 8 మందికి రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్దులను 6 విదేశీ భాషలో మాట్లాడించి వారి ప్రతిభను ప్రపంచానికి చాటడమే కాక అనేక భాషలను ఏకకాలంలో కళాత్మకంగా నేర్చుకోవచ్చని నిరూపించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఆంధ్రరాజధాని అమరావతిలో పోలీగ్లాట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు వెంకట్ పూలబాల.

ఉచితంగా భాషలను నేర్పించడమే కాక నేర్చుకున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ తన స్వంత డబ్బుతో భారీగా ప్రైజ్ లు కూడా ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ పైన విద్యార్ధి లోకం పైన భాషలపైనా తన ప్రేమను చాటుకుంటున్నారు.

బహుమతుల వివరాలు:
*మొదటి బహుమతి 50 వేలు
*రెండవ భహుమతిగా 30 వేలు
*మూడవ బహుమతిగా 20 వేలు.

ఎవరి నుంచి సహాయం స్వీకరించ కుండా ఈ నగదు బహుమతులను ఇస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇచ్చిన పిల్లలను అక్కడ వేదికపై పరిచయంచేసి అక్కడ తాను వ్రాసిన పోలిగ్లాటిజం (ఒకే పుస్తకంలో అభాషలు ఉండే పుస్తకం) అనే అరుదైన పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రరాష్ట్రం నలుమూలల నుంచి కనీసం 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారందరికీ గుర్తింపు ప్రోత్సాహం లభించేలా చూస్తానన్నారు, ఇందుకు భాషల ప్రాధాన్యత నిచ్చే స్కూల్స్ వెంకట్ పూలబాల గారిని సంప్రదించవచ్చు.

వెంకట్ పూలబాల నెంబరు: 97008 77409, మెయిల్ ఐడి writer.poolabala@gmail.com

Share via
Copy link
Powered by Social Snap