
పోలిగ్లోటిజం (Polyglotism) అవధానం ఒకటే – పోలీగ్లోట్ పూలబాల
లిటిల్ పోలిగ్లోట్ లను తయారు చేస్తున్నపోలిగ్లోట్.
పోలిగ్లోటిజం సాంప్రదాయ భారతీయ కళ అని చాలా మందికి తెలియదు. అసలు పోలిగ్లోట్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. మూడుకంటే ఎక్కువ భాషలను మాట్లాడేవారిని బహుభాషి లేదా పోలీ గ్లోట్ అంటారు. ఒక వ్యక్తి యొక్క అభిజ్ఞా సామర్థ్యాలను ప్రదర్శించడం కూడా కళే. ఉదాహరణకు అవధానం.
అవధానం సాంప్రదాయ భారతీయ కళ. అవధానం అంటే అభిజ్ఞా సామర్థ్యాలను (కాగ్నిటివ్ ఎబిలిటీస్) ను ప్రదర్శించడమే. ఇదేమీ కొత్తవిభాగం కాదు.
అరవై నాలుగు కళలు అనే మాట మనందరం సాధారణంగా వాడుతుంటాము. కానీ ఆ కళలు ఏంటి ? ఏ ఏ విభాగాలకు చెందినవి తెలుసుకుందాం.
పెయింటింగ్, డ్రాయింగ్, శిల్పం మరియు వంటి వాటిని విజువల్ ఆర్ట్స్ లేదా దృశ్య కళలు అంటారు.
ఎనామెల్‌వర్క్, ఫర్నిచర్ డిజైన్ మరియు మొజాయిక్ వంటి వాటిని అలంకార కళలు అంటారు.
డ్రాయింగ్ మరియు డిజైన్ వంటి వాటిని గ్రాఫిక్ ఆర్ట్స్ లేదా రేఖా కళలు అంటారు.
నృత్యం, సంగీతం, నాటకం, మైమ్ వంటి వాటిని పర్ఫామింగ్ ఆర్ట్స్ లేదా ప్రదర్శన కళలు అంటారు.
ఒక వ్యక్తి యొక్క అభిజ్ఞా సామర్థ్యాలను ప్రదర్శించడాం కూడా కళే. ఉదాహరణకు అవధానం.
అవధానం సాంప్రదాయ భారతీయ కళ. అవధానం అంటే అభిజ్ఞా సామర్థ్యాలను (కాగ్నిటివ్ ఎబిలిటీస్) ను ప్రదర్శించడమే. ఇదేమీ కొత్తవిభాగం కాదు. కాకపొతే ఇందులోకి పోలిగ్లోటిజం అనే కొత్త విషయాన్ని జోడించి చిన్న పిల్లలను సైతం ఆరు బాషలలో మాట్లాడిస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు పోలీగ్లోట్ పూలబాల.
ఏకకాలంలో ఆరు విదేశీ భాషలను – ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ ఇంగ్లిష్, జాపనీస్ – పిల్లలకు నేర్పుతూ వారితో మాట్లాడించి వారి ప్రతిభను వీడియోలద్వారా చాటుతున్నారు.
కె రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 7 వ 8 వ తరగతికి చిందిన పిల్లలు ఈ ఆరుభాషలలో అనేక సంబాషణలు చేస్తూ పాటలు కూడా పాడుతున్నారు. వారి ప్రతిభను చూసిన ఆలిండియా రేడియో విజయవాడ, వారికి ఒక అవకాశాన్ని కూడా కల్పించింది. ఫ్రెంచ్ జర్మన్, జాపనీస్ లో కామిడీ ప్రదర్శిస్తూ, పెద్ద పాటలు పాడటమే కాకుండా ఇండియన్ ప్లెడ్జ్ ను అన్ని భాషలలోనూ వేదికపై చెపుతూ చిన్న వయసులోనే ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
“ఆర్ధిక సామాజిక వ్యక్తిగత ప్రయోజనాలను కలిగిన పోలిగ్లోటిజం నేటి ప్రపంచంలో అత్యంత అవసరమైన కళ అని పోలిగ్లోటిజాన్ని వ్యాపింప జేయడమే నా కల” అన్నారు పూలబాల.