
క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం (21-08-22) కాకినాడలో జరిగిన వాటర్ కలర్ పోర్ట్రైట్ మరియు ఆయిల్ కలర్ లాండ్ స్కేప్ వర్క్ షాప్ డెమో చాలా ఆహ్లదకరంగా జరిగింది… ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు మంచం శివ సుబ్రహ్మణ్యముగారు, బుచ్చిబాబుగారు, శ్యామ్ సుందర్ గారు, కందిపల్లి రాజు గారు, కోటేశ్వరరావు గారు కృష్ణమాచారిగారు, వట్టూరి శ్రీనివాస్ గారు, తాళ్లపూడి ఈశ్వర్ గారు, గంట మధు గారు.. ఇంకా క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు… రాజుగారు..కోటి గారు… చక్కని ప్రతిభతో అద్భుతమైన చిత్రాలను అందరిముందు గీస్తూ… చిత్రకళలో వారి అనుభవంతో చక్కని చిత్రాలను గీసి ప్రదర్శన చేస్తూ ఈ కార్యక్రమం ఆధ్యతం అందరి ప్రశంసలు అందుకున్నారు. తదనంతరం వీరిరువురిని ప్రముఖ చిత్రకారులు మంచెం సుబ్రహ్మణ్యముగారు, బుచ్చిబాబుగారి చేతుల మీదుగా చక్కని జ్ఞాపికతోను, దుశ్శాలువతోను సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ఆకొండి అంజి నిర్వహించారు.

చాలా మంచి కార్యక్రమం 👌
తరచుగా ఇలాంటి డెమోలు చిత్రకారులకు ఉపయుక్తంగా ఉంటాయి.
ఈ లాంటి కార్యక్రమాలు నిర్వహించటం లో అంజి గారు తనవంతు కృషి చేస్తున్నందుకు అభినందనీయులు 💐
ధన్యవాదాలు గురువు గారు
Super sir akondi anji sir good culture good activities sir
ThankQ సర్