
రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలు నిర్వహిచనున్నది.
విజేతలకు మొదటి బహుమతి రూ.1000/- ద్వితీయ బహుమతి: రూ. 800/-
తృతీయ బహుమతి: రూ.500/- లతో పాటు ప్రోత్సహక బహుమతులు: 2 కథలకి ఒకొక్కటి 200/- చొప్పున ప్రకటించారు.
సామాజిక స్పృహ కలిగిన ఏ అంశంమీదైనా కథలు పోస్ట్కార్డ్ప మాత్రమే రాసి పంపాలి. ఒక రచయిత మూడు కథలు వరకు పంపవచ్చు. విజేతలకు బహుమతి సొమ్ము ఫోనే, గూగుల్ పే, పేటియం ద్వారా పంపిస్తారు. ఏ ప్రాంతంలోఉన్న తెలుగు రచయితలైనా సరే, అందరూ ఈ కథల పోటీలో పాల్గొని.. మంచి కథలతో తెలుగు కథని పరిపుష్టం చేయవలసిందిగా కోరుతున్నారు. రచయితలు తమ కథలను అక్టోబర్ 31వ తేదిలోగా ‘రమ్యభారతి’ పోస్ట్బాక్స్ నెంబర్. 5, విజయవాడ-520001 చిరునామాకు పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలని రమ్యభారతి పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ తెలిపారు.
నేను పంపిన 2 “పోస్ట్ కార్డ్ కథలు” మీకు చేరాయా ? తెలుపగలరు. బులుసు సీతారామ మూర్తి, హైదరాబాదు Mob 9849144294