అక్టోబర్ 12 న విజయవాడలో పోటరీ వర్క్ షాప్
మట్టితో బొమ్మలకు ప్రాణం పోసే ప్రాచీన కళలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “ARTIZO….where creativity transforms” సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 12 వ తేదీ ఆదివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రత్యేక పోటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ARTIZO ప్రిన్సిపాల్ స్ఫూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ (BFA) పూర్తి చేసిన ప్రముఖ పోటరీ ఆర్టిస్ట్ సురేష్ ఈ కళకి సంబంధించిన మెళకులతో పాటు వివిధ రకాల కళాకృతులను ఎలా తయారు చేయాలో వివరిస్తారని చెప్పారు. 8 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు గల ఔత్సాహికులు ఎవరైనా ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చునన్నారు.
పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేయబడుతుందని అలాగే క్లే మరియు టూల్స్ ఏర్పాటు చేయబడతాయని అన్నారు.
ఆసక్తి గలవారు 99499 99222 లో సంప్రదించవచ్చు.
