
కళాయజ్ఞ మరియు సృష్టి ఆర్ట్ ఆకాడెమీ సంయుక్తంగా నిర్యహిస్తున్న ప్రాచీన భారత్ – పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
_______________________________________________________________________
55 మంది విజేతలకు 1,55,800 రూపాయల నగదు బహుమతులు ఇవ్వబడును.
ప్రాచీన భారత దేశంలో (క్రీ.పూ. 5000 సం. నుండి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు) విలసిల్లిన నాగరికత, విజ్ఞానం, కళలు, కట్టడాలు, మహనీయులు, ఆధ్యాత్మిక రంగం, ప్రజల జీవన శైలిని అధ్యయనం చేస్తూ, ఆనాటి విశేషాలను చిత్రకళ ద్వారా ప్రపంచానికి అందజేయటమే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఫోటోగ్రఫీ లేని కాలాన్ని చిత్రకారుడు తన ఊహతో కాన్వాస్ మీదకు రికార్డ్ చేయగలుగుతారు కాబట్టి ఈ కళాపోటీని నిర్వహించడం జరుగుతుంది.
ప్రతి కార్యక్రమం విభిన్నంగా మరియు ఉపయోగకరంగా చేయడమే ఒంగోలు ఆర్ట్ ఫెస్టివల్ ఉద్దేశ్యం. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రాచీన భారత దేశపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి అందజేయాలని ఉద్దేశ్యంతో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది.
నియమ నిబంధనలు:
______________________
విధిగా పార్టిసిపేట్ చేయాలనుకునే చిత్రకారులు ఇంతకు ముందు వారు గీసిన రెండు చిత్రాలను అలాగే పూర్తి పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలను మెయిల్ లేక వాట్సాప్ లో అందజేయవలెను. చిత్రకళలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు.
సైజు 12 x 18 అంగుళాల సైజులో కాన్వాస్ బోర్డు పై ఏ మీడియంలో అయినా చేయవచ్చును (ఆయిల్, అక్రిలిక్), ఫ్రేమ్ చేయించరాదు.
రిజిస్టర్ చేసుకున్న చిత్రకారులతో చర్చించి వారికి నచ్చిన టాపిక్ మరియు రిఫరెన్స్ ఇమేజ్ ఈ నెల 15 లోపు అందజేయబడుతుంది.
- ఇచ్చిన రిఫరెన్స్ ను యధాతధంగా లేక మీ సృజనాత్మకతను జోడించి మరింత అభివృద్ధి చేయవచ్చును.
- అన్ని టాపిక్స్ కవర్ చేయవలసి వుంది కనుక ఒక్కొక్కరికి ఒక్కొక టాపిక్ ఇవ్వబడుతుంది, మీకిచ్చిన టాపిక్ పై మీరు మరింత రీసెర్చ్ చేయడం ద్వారా సృజనాత్మకత జోడించే అవకాశం ఉంటుంది.
పెయింటింగ్ హై రిజల్యూషన్ ఇమేజ్ ను ఈ నెల అక్టోబర్ 31 వ తారీఖు లోపల ఈ మెయిల్ చేయవలెను. ఒరిజినల్ వర్క్ ను ఆర్ట్ ఫెస్టివల్ కి తీసుకుని రావలెను. - రిజిస్ట్రేషన్ చేసుకున్న 100 పార్టిసిపంట్స్ మాత్రమే ఈ పోటీలో అర్హులు.
- కాష్ అవార్డుకు సెలెక్ట్ అయిన 50 పెయింటింగ్స్ ఒరిజినల్స్ ప్రోగ్రాం స్పాన్సర్స్ కు చెందుతాయి, వాటిపై పూర్తి హక్కులు స్పాన్సర్స్ వి.
- సెలెక్ట్ అయిన 50 పెయింటింగ్స్ తో ‘ప్రాచీన భారత్’ అనే కాఫీ టేబుల్ బుక్ లో ప్రచురింపబడతాయి
- పోటీలో నిలిచిన 100 మంది పెయింటింగ్స్ ‘ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్‘ లో ప్రదర్శింపబడతాయి కనుక ఒరిజినల్స్ తీసుకుని రావాలి.
- ఒరిజినల్ పెయింటింగ్ ఆర్ట్ ఫెస్ట్ కు అందజేయని చిత్రాలను పోటీ నుండి తీసివేయడం జరుగుతుంది. (విదేశాలలో ఉండేవారికి మరికొంత సమయం మినహాయింపు ఉంటుంది).
- పార్టిసిప్యాంట్స్ అందరికి శాలువా, షీల్డ్ సర్టిఫికెట్ తో ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ లో సన్మానం జరుగును.
- అనుభవజ్ఞులైన చిత్రకారులచే జడ్జిమెంట్ జరుగును కనుక ఎటువంటి వాదాలకు తావులేదు. ఆర్ట్ ఫెస్ట్ రోజునే పోటీ ఫలితాలు వెలువరిస్తాము.
- ఈ కార్యక్రమంలో పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి మార్పు చేర్పుల నిర్ణయాలనైనా తీసుకునే అధికారం నిర్వాహకులకు ఉంటుంది. వాటిపై ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు.
ఇతర వివరాలకు ఈ నంబర్ లో సంప్రదించండి. 82970 90007 (Dr. Timmiri Ravindara)
e-mail : srustisecretary@gmail.com

Best Wishes to all..
Good
I have intrested to join your art compilation