
కళాకారుల డిమాండ్ల తో కలెక్టర్ కు వినతి పత్రం …
ది.30-06-2021 తేదీన బుధవారం ఉదయం కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా సమితి అద్వర్యంలో కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.
కరోన మహమ్మారి కారణంగా కళారంగం పూర్తిగా కుదేలు అయిపోయినది. వృత్తి కళాకారులు, వాయిద్య, రంగ స్థల కళాకారులు ప్రోగ్రాములు లేక వారి దినసరి జీవితం చాలా దుర్భరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ 16 కోట్ల బకాయిలు అలానే ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెంచాలని ప్రధానంగా కోరారు.
కళాకారుల డిమాండ్లు:
- కళాకారులకు ఇవ్వాల్సిన గత ప్రభుత్వ బకాయిలను తక్షణమే ఇవ్వాలి.
- కరోన ఆర్థిక సహాయం ప్రతి పేద కళాకారునికి 10,000 రూపాయలు ఇవ్వాలి.
- వృద్ధ కళాకారుల పెన్షన్ 5000/- రూపాయలకు పెంచాలి.
- కళారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలి.
- ప్రభుత్వం కళాకారులకు ప్రచార కార్యక్రమాలు ఇచ్చి ఆదుకోవాలి.
కళ కోసం బ్రతుకుతూ తమ జీవితాన్ని కళకే అంకితం చేసిన కళాకారులను. తక్షణం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గని, గుంటూరు జిల్లా సమితి అధ్యక్షులు అరేటి రామారావు, గుంటూరు నగర అధ్యక్షులు మెట్టపల్లి మహేంద్ర, గుంటూరు నగర కార్యదర్శి చెవుల పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.