దోసిట చినుకులు …

నాకు సినిమాలంటే విపరీతమయిన ఇష్టం. సండూరు, బళ్లారి, దౌండ్, పునే, బెంగుళూరు- ఇలా నేను తిరిగిన, బ్రతికిన ఊళ్లలోని సినిమా థియేటర్లు కరుణించిన వివేకం ,
జ్ఞానాన్ని నేను నేటికీ స్మరిస్తాను. నిజం చెప్పాలంటే నేను బలవంతంగా చదివిన టెక్స్ట్ పుస్తకాల కంటే ఎక్కువ నన్ను రూపుదిద్దింది గొప్ప ప్రపంచ సినిమాలే.
దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ప్రకాష్ రాజ్.
అభిమాన నటుల పై మనం ఎన్నో ఏళ్ల నుండి పెంచుకున్న ఆరాధన, అభిమానం కాలం గడిచేకొద్దీ ఒక్కోసారి మంచులా కరిగిపోతుంది. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో నాకు అలా జరగలేదు.
ప్రతిభ అనే ఏకమాత్ర అర్హతతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అద్భుతమయిన నటుడు. తన గొప్ప నటనతో అనంత అభిమానుల్ని సృష్టించుకున్నారు.
అంతే కాదు ఆయన వర్తమాన పరిస్థితులపై స్పందించే మానవీయ ప్రేమతో ఎంతోమంది గుండెల్ని చూరగొన్నారు. ఇది నా దృష్టిలో కళాకారుడి నిజమైన విజయం అని నేను భావిస్తాను.
నేడు ప్రకాష్ రాజ్ గారిని ప్రేమించే, గౌరవించే, ఇష్టపడే జనం ఈ నేల మీద, బహుత్వం మీద నమ్మకం ఉంచినవారు. వీరందరూ పల్లె, వాడ, రైతు, కార్మిక వలయం ఇలా కష్టపడి పనిచేసే, ఎవరిని నొప్పించని, బాధ పెట్టని సమూహాలకు చెందినవారు. లోకంలో ప్రతి చలనం మానవీయంగా ఉండేలా చూసుకునేవారు.
నాకు ఇలాంటి అద్భుతమయిన మనస్సుని చూసే, మాట్లాడే ఆశ చాలా రోజుల నుండి ఉండేది. కలలు కనని రోజు లేదు.
ప్రకాష్ రాజ్ గారి కలం నుండి జాలువారిన ఈ చిన్ని చిన్ని వ్యాసాలు ప్రతి మనిషినీ ఆలోచించేలా చేస్తాయి.
దట్టమైన అడవిలో దారి తప్పిన మనిషిని చెయ్యి పట్టుకుని నడిపించి నట్టు ఓదారుస్తాయి. అక్షరరూపంలో ఆయన ఆలోచనలు ప్రతిక్షణం అబ్బురపరుస్తాయి. ఈ పుస్తకంలో ప్రకాష్ రాజ్ ఒక చోట ‘నాకు చదివే సుఖం గురించి తెలుసు, రాసే ఆనందం గురించి వినడమే తప్ప రాసే వరకు తెలియదు ‘ అంటారు.
ఇలాంటి గొప్ప పుస్తకాన్ని అనువదించడం నా అదృష్టంగా భావిస్తూ, దీన్ని సాధ్యం చేసిన ప్రముఖ కన్నడ పాత్రికేయులు, రచయిత, క్రేజీ ప్రాగ్ మీడియా అధినేత శ్రీ జి.ఎన్. మోహన్ గారు మరియు శ్రీజ నాయర్ గారికి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం పుస్తకం ప్రచురించిన మిసిమి వారికి నా ధన్యవాదాలు…
-సృజన్

ప్రతులకు: మిసిమి ప్రచురణలు( 9949516567)

SA:

View Comments (5)