పాత్రికేయుల ప్రగతికి కృషి చేస్తా- శ్రీనాథ్

జర్నలిస్ట్ కమ్యూనిటీ అభ్యున్నతికి అంకితభావంతో కృషిచేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కేబినెట్ హోదా పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ ఆ సోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) సంఘ నాయకులు మంగళవారం(18-02-20) విజయవాడ లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. శాలువాతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భగా దేవిరెడ్డి శ్రీనాథ్ మాట్లాడుతూ సంఘాలు ఎన్నివున్నా జర్నలిస్ట్స్ అంతా ఒకే కమ్యూనిటీ అన్నారు. ఒక పాత్రికేయునిగా జర్నలిస్టుల సమస్యలు గుర్తెరిగి సమస్యల పరిష్కారానికి సేవలందిస్తా నన్నారు. ముఖ్యమత్రి జగన్ మోహన్ రెడ్డి జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రగతికి చేపట్టవలసిన చర్యలుపట్ల మార్గదర్శకాలు రూపొందించమన్నారని తెలిపారు. పాత్రికేయుల ప్రగతికి ప్రెస్ అకాడమీ ఎల్లవేళలా అందుబాటులో వుంటుందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ను సన్మానించినవారిలో పెన్ సంఘ నాయకులు బడే ప్రభాకర్, జూనూతుల శివరామ్, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర్ తిలక్, వేంకటేశ్వర ప్రసాద్ అవాల దుర్గా ప్రసాద్, టీవీ రంగారావు, ఆనంద్, వర్మ, వెంకట్ తదితరులున్నారు.

SA: