సజీవ చిత్రపతి …రవివర్మ

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 29

భారతీయ చిత్రకళా సరస్వతి, తైలవర్ణ చిత్రపతి రాజా రవివర్మ. దక్షిణ భారతీయ వనితలలో ఆకట్టు కునే కట్టుబొట్టూ, చీరకట్టులో, మన హిందూ దేవీ దేవతలను ఊహించి ప్రేరణ పొంది తైలవర్ణ చిత్రా లుగా రూపొందించాడీ ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడు.
రామాయణ, మహాభారతాది పురాణ ఘట్టాలను తైలవర్ణాలుగా మార్చడంలో రవివర్మ అందెవేసిన చెయ్యి. తైలవర్ణ చిత్రలేఖనంలో ప్రత్యేకంగా తనదైన ఓ శైలికి రవివర్మ ప్రతీకగా ప్రపంచాన నిలవటం మనకు గర్వకారణం. రాజవంశంలో జన్మించి, తాను మెరుగ్గా వున్నప్పుడే వన్నె తగ్గుతున్న మన భారతీయ చిత్రకళ నిగ్గుతేల్చిన తైలవర్ణ చిత్ర దిగ్గజం రవివర్మ. చూపరులు రెప్పలార్ప కుండా మైమరచి చూసేంత అపు ‘రూప’ చిత్రాల సృష్టికర్త ఆధునిక భారతమయబ్రహ్మ వియన్నాలో తన బొమ్మలకు గాను తానందుకొన్న మొదటి బహుమతి మన భారతీయ చిత్రకళకు పురోగతి. నాటి ఆంగ్ల ప్రభుత్వాన్ని కూడా వైశ్రాయ్ లార్డ్ కర్జన్ ద్వారా తన తైలవర్ణ చిత్రపటాలతో మెప్పించి కైజర్-ఐ-హింద్ స్వర్ణపతకం, “రాజా” బిరుదాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మీ, సరస్వతి, యశోదా శ్రీకృష్ణ రవివర్మ చిత్రాలలో ప్రాముఖ్యత సంతరించుకొన్నవి. అంచెలంచెలుగా ప్రపంచస్థాయికి ఎదిగిన భారతీయ కుంచె, భారత చిత్రరత్న చత్రపతి రాజా రవివర్మ నేటికీ మన ధృవతార!

( రాజా రవివర్మ జన్మదినం 29 ఏప్రిల్ 1848)

SA: