రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు యఫ్.డి.సి. చైర్మన్ రామ్మోహన్ రావు , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని “కైమాక్స్” చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘భవాని శంకర్ ఒక డిఫరెంట్,టఫ్ సబ్జెక్ట్ తో నా ముందుకు వచ్చాడు. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయనటువంటి పాత్రలో నటించాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా షాక్ కు గురవుతారు. మనం సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశాము అనే దానికంటే మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అందరి సపోర్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి అప్పుడే ఇలాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు. తను తీసిన డ్రీమ్ సినిమా కమర్షియల్ గా ఎంతో హిట్టయింది. ఆ సినిమాకు తను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ “క్లైమాక్స్” చిత్రం ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇలాంటి మంచి మూవీలో అద్భుతమైన పాత్ర ఇచ్చిన భవానీశంకర్ నా కృతజ్ఞతలు. ఇందులో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నేను చేసిన గెటప్స్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నటించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందని అభినందించడమే కాక మీరే 100 మందికి చూడమని చెప్పేలా ఉంటుంది’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

1 thought on “రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

  1. చాలా సంతోషం. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పెద్ద దిక్కైతే, శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీ వీ పూర్ణచంద్ గార్లు నిత్య కృషీవలురు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఈ నలుగురూ నాలుగు మూల స్తంభాలు.
    అద్భుతంగా నిర్వహించిన మీ సభల్లో చాలా సభలలో నేను పాల్గొనడం నా అదృష్టం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముందు జరిపిన సభలో వలే గొప్ప గా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సభలకు తప్పకుండా హాజరౌతాను.ఆత్మీయులు పూర్ణచందు గారికి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
    శుభాకాంక్షలతో … మీ శ్రీహరికోటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap